News April 11, 2024
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ జీవో ఇచ్చింది. ఈ GO ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేయగా.. ఈ నెల 15న న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 10, 2025
శంకరుడి దశావతారాలు మీకు తెలుసా?

1. మహాకాలుడు – మహాకాళి,
2. తార్ – తార,
3. బాలభువనేశుడు – బాలభువనేశ్వరి,
4. షోడశశ్రీవిద్యేశుడు – షోడశశ్రీవిద్యేశ్వరి,
5. భైరవుడు – భైరవి,
6. చిన్న మస్తకుడు – చిన్న మస్తకి,
7. ధూమవంతుడు – ధూమవతి,
8. బగలాముఖుడు – బగళాముఖి,
9. మాతంగుడు – మాతంగి, 10. కమలుడు – కమల.
News November 10, 2025
శివయ్యను ఎలా పూజిస్తే సంతోషిస్తాడు?

శివుడికి కొన్ని పూలంటే చాలా ఇష్టం. మారేడు దళాలతో పూజిస్తే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడట. శంఖం పూలు సమర్పిస్తే సంతోషపడతాడట. నాగమల్లి పూలతో పూజిస్తే పుణ్య కార్యాలు చేసిన ఫలితం ఉంటుందట. సంపెంగ పూలు పెడితే ప్రసన్నమవుతాడని, జిల్లేడు పూలు సమర్పిస్తే, పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా ఇష్టమైన వాటితో ఆరాధిస్తే శివయ్య సంతోషించి, శుభాలు కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు.
News November 10, 2025
ఏపీ టుడే

* ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. సీఐఐ సమ్మిట్, మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలపై అంచనాలు, పరిహారంపై చర్చకు అవకాశం. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్.
* ఇవాళ, రేపు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండుగా విడిపోయి పర్యటన. నేడు బాపట్లలో టీమ్-1, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో టీమ్-2 పంట నష్టాలపై అంచనా వేయనున్నాయి.


