News April 30, 2024

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత వివరాలు పంపాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ ఆదేశించారు. సిబ్బంది పుట్టిన తేదీని స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా టీసీ లేదా మార్క్స్ మెమో ప్రకారం గుర్తించాలని సూచించింది. ఇవేమి లేకుంటే వైద్యధ్రువీకరణ పత్రం ఇవ్వాలని పేర్కొంది.

Similar News

News March 27, 2026

ఈ శ్రీరాముడి గుణాలే తారకమంత్రం!

image

శ్రీరాముడి నాయకత్వ లక్షణాలు నేటికీ ఆదర్శమే. ఎన్ని కష్టాలొచ్చినా నమ్మిన ధర్మాన్ని, విలువలను పక్కనపెట్టలేదు. భరతుడికి కబురు పంపితే రావణుడిపై దండెత్తడానికి మహాసైన్యమే వచ్చేది. కానీ 14ఏళ్ల వనవాసానికి భంగం కలగొద్దని వానరులనే రామదండుగా మార్చుకున్నాడు. ఉన్న వనరులతోనే విజయాలు సాధించొచ్చనడానికి ఇదో ఉదాహరణ. నిజాయతీ, నిబద్ధత, సమానత్వం, సమయపాలన పాటిస్తూ ఏ పని ఎవరికి అప్పగించాలో గ్రహించగలిగే సమర్థుడు రాముడు.

News March 27, 2026

10 లక్షల మందితో గ్రౌండ్ వార్‌కు ఇరాన్ రెడీ?

image

అమెరికాతో గ్రౌండ్ వార్ జరిగే ఛాన్స్ ఉందన్న వార్తలతో ఇరాన్ అలర్ట్ అయింది. ఏకంగా 10 లక్షల మంది ఫైటర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బసిజ్, IRGC రిక్రూట్‌మెంట్ సెంటర్లకు వాలంటీర్లు భారీగా క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అటు అమెరికా కూడా తన ఎలైట్ ఫోర్సెస్‌ను పశ్చిమాసియాకు పంపేందుకు ప్లాన్ చేస్తోంది. ట్రంప్ చర్చల గురించి చెబుతున్నా ఇరాన్ మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తూ యుద్ధానికి సిద్ధమవుతోంది.

News March 27, 2026

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై గిల్ ఏమన్నారంటే..

image

IPLలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్‌ వల్ల క్రికెట్‌లో అసలైన నైపుణ్యం దెబ్బతింటోందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ 11 మంది ఆడే ఆట అని, ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను చేర్చడం వల్ల గేమ్ వన్ సైడ్‌గా మారుతుందని పేర్కొన్నారు. భారీ స్కోర్ల కంటే సవాల్‌తో కూడిన వికెట్లపై ఆడే మ్యాచ్‌లే థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నారు. రోహిత్, హార్దిక్, అక్షర్ కూడా ఈ రూల్‌ను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.