News July 1, 2024

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. 0-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకరు, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ముగ్గురు, 61కి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు గతంలో మాదిరిగానే టీచర్లను కేటాయించనుంది. స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కేటాయింపు చేపట్టనుంది.

Similar News

News July 3, 2024

TDP ఆఫీసుపై దాడి.. పోలీసుల అదుపులో నిందితులు

image

AP: మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో మంగళవారం అర్ధరాత్రి పలువురిని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 బృందాలుగా ఏర్పడి నిందితుల వివరాలను రెండు, మూడు రోజులుగా సేకరించారు. CC కెమెరాల ద్వారా దాడికి పాల్పడిన వారిని గుర్తించారు. ఇందులో గుంటూరుకి చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలే ఉన్నట్లు నిర్ధారించారు. పోలీసుల గాలింపు చర్యలతో పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

News July 3, 2024

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్!

image

TG: నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రేపు లేదా ఎల్లుండి కొత్త మంత్రుల ప్రకటనతో పాటు శాఖల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశముంది.

News July 3, 2024

రైతు భరోసా ఎన్ని ఎకరాలకివ్వాలి?

image

TG: రైతు భరోసా(రైతుబంధు) ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు.. మరింత మంది సలహాలు స్వీకరించనున్నారు. ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు. 5 ఎకరాలు, 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు ఎవరికి ఇవ్వాలనే దాన్ని ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు.