News November 16, 2024
స్కూళ్లపై కీలక నిర్ణయం
AP: 2025-26 నుంచి ప్రాథమికోన్నత పాఠశాల విధానాన్ని తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6, 7, 8 తరగతుల్లో 30మంది విద్యార్థుల కంటే తక్కువుంటే ప్రైమరీ, 60కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నతపాఠశాలగా మార్చనుంది. అలాగే బేసిక్, ఆదర్శ స్కూళ్లను ప్రభుత్వం నిర్వహించనుంది. బేసిక్‌లో 20మందిలోపు పిల్లలుంటే ఒక SGT, 60మందికి 2 SGT, ఆ పైన ప్రతి 30మందికి అదనంగా ఒక SGTని, ఆదర్శ స్కూల్లో ప్రతి తరగతికి ఓ SGTని కేటాయిస్తుంది.
Similar News
News November 16, 2024
నేడు తరగతుల బహిష్కరణ: R.కృష్ణయ్య
TG: రాష్ట్రంలో నేడు తరగతుల బహిష్కరణ చేపట్టనున్నట్లు BC సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు R.కృష్ణయ్య ప్రకటించారు. ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్, పెండింగ్ ఫీజులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. స్కాలర్షిప్లను రూ.5,500 నుంచి రూ.20వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏపీలో రూ.20వేలు, కర్ణాటకలో రూ.15వేలు ఇస్తున్నారని తెలిపారు.
News November 16, 2024
మహాసేన రాజేశ్‌పై కేసు నమోదు
AP: టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్, అతని అనుచరులపై కేసు నమోదైంది. తన ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారని ఓ మహిళ ఫిర్యాదు చేయగా, కోనసీమ జిల్లా మలికిపురం స్టేషన్లో కేసు నమోదైంది. మార్ఫింగ్‌పై ఫేస్బుక్ నుంచి వివరాలు కోరామని, స్పష్టత రాగానే చర్యలుంటాయని పోలీసులు చెప్పారు. రాజేశ్ మాట్లాడుతూ.. తన పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారనన్నారు. ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని చెప్పారు.
News November 16, 2024
మోసపోయిన స్టార్ హీరోయిన్ తండ్రి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ తండ్రి జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్లు రూ.25 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. FIR ప్రకారం.. డిప్యూటీ SPగా పనిచేసి రిటైరైన జగదీశ్‌కు UP ప్రభుత్వంలో ఉన్నత పదవి ఇప్పిస్తామని నమ్మబలికి కొంతమంది రూ.25 లక్షలు తీసుకున్నారు. పని అవ్వకపోవడంతో డబ్బు తిరిగివ్వమని అడగ్గా చంపేస్తామని బెదిరించారు. నిందితుల్ని గుర్తించామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.