News September 5, 2024
పింఛన్ల పంపిణీ విధానంపై కీలక నిర్ణయం

AP: పింఛన్ల పంపిణీలో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక L1 RD(రిజిస్టర్డ్) ఫింగర్‌ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ₹53 కోట్లను గ్రామ, వార్డు సచివాలయ శాఖకు కేటాయించింది. 1.34 లక్షల కొత్త స్కానర్లతో OCT నుంచి పింఛన్లు పంపిణీ చేయనుంది. ప్రస్తుతం వినియోగిస్తున్న L0 RD డివైజ్‌లలో సెక్యూరిటీ తక్కువగా ఉండటంతో నకిలీ వేలిముద్రలతో పింఛన్లు స్వాహా చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి.
Similar News
News March 1, 2025
‘జనరేటర్‌లో షుగర్ ఎందుకు వేశారు అన్నా?’.. విష్ణు జవాబిదే..

మంచు విష్ణు ఓ నెటిజన్ నుంచి ఎదురైన ఇబ్బందికర ప్రశ్నకు ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. నిన్న Xలో ముచ్చటించిన విష్ణును ‘మంచి మనసున్న మీరు ఆ రోజు జనరేటర్‌లో షుగర్ ఎందుకు వేశారు అన్నా? అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ‘ఇంధనంలో షుగర్ వేస్తే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్‌లో చదివాను’ అని విష్ణు రిప్లై ఇచ్చారు. కాగా ఇటీవల తన తల్లి పుట్టినరోజు నాడు విష్ణు, అతడి అనుచరులు జనరేటర్‌లో షుగర్ వేశారని మనోజ్ ఫిర్యాదు చేశారు.
News March 1, 2025
కొత్త ఏడాదిలో 2 నెలలు కంప్లీట్.. మరి?

2025లో అడుగుపెట్టి 2 నెలలు గడిచిపోయాయి. ఇన్ని రోజులూ అనుకున్నది చేయలేకపోయినా JAN 1 నుంచి మొదలుపెట్టాలని గతేడాది చివర్లో ప్లాన్ వేసుకొని ఉంటాం. బుక్స్ చదవాలనో, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలనో, జిమ్‌కు వెళ్లాలనో, ఇతరత్రా రిజల్యూషన్స్ తీసుకుంటాం. వాటిని స్టార్ చేసి వదిలేసిన వారు, కొనసాగిస్తున్న వారు, అసలు మొదలెట్టని వారూ ఉంటారు. మరి మీ రిజల్యూషన్స్ ఎక్కడి వరకు వచ్చాయో COMMENT చేయండి.
News March 1, 2025
కౌలు రైతులకూ రూ.20 వేల సాయం

AP: ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ఈ ఏడాది నుంచి ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద రూ.20 వేలను భూమిలేని కౌలు రైతులకూ ప్రభుత్వం అందించనుంది. సాధారణంగా సాగు భూమి ఉన్న రైతులకు ‘పీఎం కిసాన్ యోజన’ కింద కేంద్రం ఏడాదికి రూ.6వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు ఇస్తుంది. దీన్ని కౌలు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా, విధివిధానాలు త్వరలో రూపొందించనున్నారు.