News July 5, 2025
‘మహా’ రాజకీయాల్లో కీలక పరిణామం

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే సోదరులు మరాఠీ భాష కోసం ఒక్కటి కాబోతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ ఫార్ములాను వ్యతిరేకిస్తూ MH నవనిర్మాణ సేన చీఫ్ రాజ్, శివసేన(UBT) అధినేత ఉద్ధవ్ ఇవాళ సంయుక్తంగా మెగా ర్యాలీ చేపట్టనున్నారు. 2 దశాబ్దాల తర్వాత వీరు కలుస్తుండటంతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పొత్తు ఉదయిస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News July 5, 2025
ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్‌కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.
News July 5, 2025
PF అకౌంట్లో వడ్డీ జమ చేసిన EPFO

దేశంలోని కోట్లాది మంది PF ఖాతాదారులకు EPFO శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వడ్డీ డబ్బును జమ చేసింది. PF ఖాతాలో ఉన్న ఎంప్లాయి, ఎంప్లాయర్ షేర్ డబ్బుపై <<16496950>>8.25శాతం<<>> వడ్డీకి తగినట్లు ఈ డబ్బును జమ చేసింది. PF ఖాతాదారుల పాస్‌బుక్‌లో 31/03/2025 నాడు ఈ వడ్డీ జమ చేసినట్లు అప్‌డేట్ అయ్యింది. మీ ఖాతాలోనూ PF వడ్డీ డబ్బులు జమ అయ్యాయా? చెక్ చేసుకోండి.
News July 5, 2025
రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు

TG: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా రేపటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం కానుంది. 175 కాలేజీల్లో 1.18 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో బీటెక్ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నా, తొలి విడత కౌన్సెలింగ్‌లో పెరిగిన సీట్లు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ నెల 26, 27 తేదీల్లో రెండో విడత కౌన్సెలింగ్ జరగనుండగా, అప్పటిలోగా పెరిగిన సీట్లు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.