News March 7, 2025
ఈశాన్య భారతంలో కీలక పరిణామం.. ఏంటంటే!

ఈశాన్య భారతంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మయన్మార్ జుంటా సర్కారుపై పోరాడుతున్న చిన్ స్టేట్ ప్రో డెమోక్రసీ రెబల్ గ్రూప్స్ మిజోరం CM లాల్దుహోమా సమక్షంలో ఐజ్వాల్‌లో విలీన ఒప్పందంపై సంతకాలు చేశాయని తెలిసింది. చిన్‌ల్యాండ్ కౌన్సిల్, ICNCC కలిసి సంయుక్త చిన్ జాతీయ మండలిని ఏర్పాటు చేయనున్నాయి. ఈశాన్యంలో శాంతి స్థాపనకిది కీలకం కానుంది. చిన్‌లో ఉండేది మిజో ప్రజలే. ఇక్కడి వాళ్లతో వారికి సంబంధాలు ఉన్నాయి.
Similar News
News September 18, 2025
చేతిలో బిట్ కాయిన్‌తో ట్రంప్ విగ్రహం

క్రిప్టో కరెన్సీకి మద్దతిస్తున్న డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఇన్వెస్టర్లు ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ DCలోని యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్ బయట 12 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చేతిలో బిట్ కాయిన్‌తో బంగారు వర్ణంలో ఈ విగ్రహం ఉంది. దీన్ని వెండి, అల్యూమినియంతో తయారు చేసి, బంగారు పూత వేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వడ్డీ <<17745765>>రేట్లు<<>> తగ్గించిన కాసేపటికే దీన్ని ఆవిష్కరించారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
RTCలో డ్రైవర్ పోస్టులు.. అర్హతలు ఇవే

TGSRTCలో 1,000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైన సంగతి తెలిసిందే. డ్రైవర్ పోస్టులకు వయో పరిమితి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస విద్యార్హత పదో తరగతి పాసై ఉండాలి. పేస్కేల్ రూ.20,960-60,080గా ఉంటుంది. హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ (HPMV), హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <