News March 31, 2024
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. రేపు ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ప్రభాకర్ రావును విచారించిన అనంతరం బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న సస్పెండై పోలీసు కస్టడీలో ఉన్నారు.
Similar News
News January 27, 2026
ఇవాళ సా.4 గంటలకు ఎన్నికల షెడ్యూల్

TG: ఇవాళ సాయంత్రం 4 గంటలకు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగనున్నాయి.
News January 27, 2026
కాల్పులు ఆపాలని పాక్ వేడుకుంది.. UNలో ఇండియా కౌంటర్

ఇండియాకు, ఇండియాలోని ప్రజలకు హాని కలిగించడమే పాక్ ఏకైక అజెండా అని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ UN వేదికగా మండిపడ్డారు. ‘మే 10న కాల్పుల విరమణ కోసం పాక్ వేడుకుంది. మా ఆపరేషన్‌లో పాక్ ఎయిర్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. అందుకు సంబంధించిన ఫొటోలు పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి’ అని చెప్పారు. ఇండియా చేపట్టిన OP సిందూర్‌కు తాము బదులిచ్చామంటూ UNSCలో పాక్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
News January 27, 2026
DRDOలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని <


