News October 15, 2024

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం

image

AP స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. సీమెన్స్ సంస్థకు చెందిన రూ.23 కోట్ల విలువైన ఆస్తులను ఎటాచ్ చేసింది. నకిలీ బిల్లులతో కొనుగోళ్లు జరిపినట్లు, వ్యక్తిగత ఖాతాలకు ఈ సంస్థ నిధులు మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇదే కేసులో గతేడాది చంద్రబాబు జైలుకెళ్లారు.

Similar News

News December 11, 2025

CIBC ప్రెసిడెంట్‌తో లోకేశ్ భేటీ

image

AP: కెనడా- ఇండియా బిజినెస్ కౌన్సిల్(CIBC) ప్రెసిడెంట్ విక్టర్ థామస్‌తో మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏపీలో విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు కెనడియన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దీనికి విక్టర్ సానుకూలంగా స్పందించారు. పారిశ్రామికాభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు.

News December 11, 2025

మహిళల్లో త్వరగా వృద్ధాప్యం రావడానికి కారణమిదే!

image

మహిళల్లో జీవ సంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేయడంలో గర్భధారణ కీలకపాత్ర పోషిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. న్యూయార్క్​లోని కొలంబియా యూనివర్సిటీ మెయిల్​మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన అధ్యయనంలో స్త్రీలలో జీవశాస్త్రపరంగా గర్భం దాల్చిన స్త్రీలు.. గర్భం దాల్చని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారని గుర్తించారు. పురుషులలో ఇలాంటి జీవసంబంధమైన వృద్ధాప్యం వంటివి లేవని ఈ అధ్యయనం తెలిపింది.

News December 11, 2025

రాష్ట్రంలో 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

ఏపీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ 26 జిల్లాల్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువనైల్ జస్టిస్ బోర్డులో ఖాళీగా ఉన్న 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హ్యూమన్ హెల్త్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని అనుభవం గల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.