News May 1, 2024
ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. వివిధ అరెస్టై జైళ్లలో ఉన్న నాయకులు వర్చువల్ పద్ధతిలో ఎన్నికల ప్రచారం చేయడం కుదరదని తేల్చి చెప్పింది. అత్యంత సాహసోపేతమైందిగా దీన్ని వర్ణించింది. అరెస్టైన నేతలు లోక్‌సభ వర్చువల్‌గా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై కోర్టు ఇలా స్పందించింది. అయితే.. ఈ పిల్ ఎవరు వేశారనేది తెలియరాలేదు.
Similar News
News March 11, 2026
‘RC17’పై బిగ్ అప్‌డేట్ ఎప్పుడు?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే సినిమా గురించి బిగ్ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నెల 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా పెద్ద ప్రకటన ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ స్టోరీని రెండు వెర్షన్‌లుగా సిద్ధం చేశారని, చరణ్‌తో చర్చించి ఒక దానిని ఫైనల్ చేయాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం RC నటిస్తున్న ‘పెద్ది’ మూవీ APR 30న రిలీజ్ కానుంది.
News March 11, 2026
‘హార్ముజ్’లో నావల్ మైన్స్? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్!

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మైన్స్‌ను ఏర్పాటు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ‘ఇరాన్ హార్ముజ్ జలసంధిలో నావల్ మైన్స్ ఏర్పాటు చేసినట్లయితే వెంటనే తొలగించాలి. లేదంటే ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో మిలిటరీ చర్యలు ఉంటాయి’ అని హెచ్చరించారు. కాగా ‘హార్ముజ్’ గుండా ఆయిల్ ట్యాంకర్‌ను ఎస్కార్ట్ చేసినట్లు US నేవీ SMలో పోస్ట్ చేసి డిలీట్ చేయగా, ట్యాంకర్‌ను ఎస్కార్ట్ చేయలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది.
News March 11, 2026
2027 జనగణన.. ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

AP: 2027 జనగణనలో భాగంగా ఈ ఏడాది మే 1 నుంచి హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సెస్ చేపడుతున్నట్లు CM CBNకు సెన్సెస్ ఆపరేషన్స్, సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ జె.నివాస్ వివరించారు. జనాభా లెక్కల ప్రక్రియ 2 దశల్లో జరగనుండగా, తొలి దశలో ఇళ్ల జాబితా, గృహ గణన చేపట్టనున్నట్టు తెలిపారు. మే 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. APR 16-30 స్వీయ గణనకు అవకాశం కల్పిస్తారు. రెండో దశలో 2027 FEB నుంచి జనాభా లెక్కింపు ఉంటుంది.


