News April 24, 2024

కిలో మామిడి (2×2)×√225

image

వేసవిలో మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువ. తియ్యని పండ్లు, పచ్చడి కాయలు కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఎక్కడో తెలియదు కానీ ఓ మామిడి కాయల విక్రేత తనలో గణిత నిపుణుడు ఉన్నారని చాటి చెప్పారు. కిలో (2×2)×√225 అంటూ బోర్డు పెట్టారు. అది చూసిన నిరక్షరాస్యులు ధర అర్థంకాక ముక్కున వేలేసుకుంటున్నారు. సింపుల్‌గా కిలో రూ.60 అని చెబితే పోయేదానికి మ్యాథమెటిక్స్ ఎందుకంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News February 6, 2026

నారాయణ నామంతో జైలు వాతావరణమే మారింది!

image

మంత్ర జపం మనసును ప్రశాంతపరిచి, అంతర్గత బంధనాల నుంచి విముక్తి కలిగిస్తుందని ఫారన్ రైటర్ ‘స్వామిని విశ్వప్రతిభ’ వెల్లడించారు. ఆమె కెనడాలోని ఓ జైలులో మహిళా ఖైదీలకు ఓంకార నాదం, నారాయణ మంత్రాలను బోధించారు. ‘ఓం నమో నారాయణాయ’ అంటూ ఖైదీలు జపించడంతో మానసిక ప్రశాంతతను పొందారని, సంతోషంగా ఉండగలిగారని ఆమె చెప్పారు. మంత్ర తరంగాలు జైలు వాతావరణంలో సానుకూల మార్పు తెచ్చాయని వెల్లడించారు.

News February 6, 2026

హోమ్, పర్సనల్ లోన్‌పై ప్రభావం ఉంటుందా?

image

ఆర్బీఐ రెపో రేటు(5.25)ను <<19064412>>యథాతథంగా<<>> ఉంచడంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్నవారికి EMIలలో ఎలాంటి మార్పులు ఉండవు. ఉదాహరణకు 30 ఏళ్లలో తీర్చేలా 8.20 శాతం వడ్డీతో రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే EMI రూ.37,346గా ఉంటుంది. అలాగే ఐదేళ్లలో తీర్చేలా 12 శాతం వడ్డీతో రూ.5 లక్షల పర్సనల్ లోన్ తీసుకుంటే EMI రూ.11,122గా ఉంటుంది.

News February 6, 2026

వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న U19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడుతున్నారు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశారు. అతడి ఇన్నింగ్స్‌లో 10 సిక్సులు, 9 ఫోర్లున్నాయి. ప్రస్తుతం 119 పరుగులతో ఆడుతున్నారు. 21 ఓవర్లలో టీమ్ స్కోరు 186-2. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులు చేసి ఔట్ అయ్యారు. U19 WCలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. ఫైనల్‌లో సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్ వైభవ్.