News April 24, 2024
కిలో మామిడి (2×2)×√225

వేసవిలో మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువ. తియ్యని పండ్లు, పచ్చడి కాయలు కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఎక్కడో తెలియదు కానీ ఓ మామిడి కాయల విక్రేత తనలో గణిత నిపుణుడు ఉన్నారని చాటి చెప్పారు. కిలో (2×2)×√225 అంటూ బోర్డు పెట్టారు. అది చూసిన నిరక్షరాస్యులు ధర అర్థంకాక ముక్కున వేలేసుకుంటున్నారు. సింపుల్‌గా కిలో రూ.60 అని చెబితే పోయేదానికి మ్యాథమెటిక్స్ ఎందుకంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 28, 2026
16ఏళ్లలోపు పిల్లలకు ఇండోనేషియాలో SM బ్యాన్!

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి దేశంలో 16ఏళ్లలోపు పిల్లలు SM వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 16ఏళ్లలోపు పిల్లలు అకౌంట్స్ ఓపెన్ చేయలేరు. ఆస్ట్రేలియా తర్వాత ఈ తరహా కఠిన చట్టాన్ని తెచ్చిన దేశంగా ఇండోనేషియా నిలిచింది.
News March 28, 2026
EPFO యాప్‌తో రూ.5 లక్షల వరకు విత్‌డ్రా!

ఉద్యోగులు UMANG యాప్‌తో పాటు EPFO యాప్ ద్వారా కూడా PF నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.5లక్షల(75%) వరకు పెంచారు. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన UPI PIN ఉపయోగించి సులభంగా పొందవచ్చు. పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, నామినీ అప్‌డేట్ వంటి సేవలు పొందవచ్చని, దీనివల్ల 8 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని EPFO వెల్లడించింది.
News March 28, 2026
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్

LPG సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది. ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ లింకులు, నకిలీ కాల్స్ ద్వారా వినియోగదారుల బ్యాంక్ వివరాలు, OTPలు సేకరించి కేటుగాళ్లు సొమ్ము దోచుకుంటున్నారు. అందుకే ఎవరికీ OTPలు చెప్పవద్దని, ఫేక్ APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


