News December 9, 2024
కేజీ టమాటా రూపాయి

AP: నిన్నమొన్నటి వరకు రైతులకు లాభాలు ఆర్జించి పెట్టిన టమాటా ఒక్కసారిగా పతనమైంది. కర్నూలు జిల్లా పత్తికొండలో కిలో టమాటా ధర ఏకంగా రూపాయికి పడిపోయింది. దీంతో గిట్టుబాటు ధర లేక అన్నదాతలు టమాటాలను పారబోస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ సహా పలు నగరాల్లో కేజీ టమాటా రూ.30-40 పలుకుతోంది.
Similar News
News December 5, 2025
‘పకడ్బందీగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి’

ఖమ్మం: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేసామని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు అన్నారు. శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదటి విడతకు మొత్తం 1582 బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.
News December 5, 2025
మోతాదు మించితే పారాసిటమాల్ ప్రమాదమే: వైద్యులు

సరైన మోతాదులో తీసుకుంటే పారాసిటమాల్ సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక మోతాదులో వాడటం వల్ల లివర్ ఫెయిల్యూర్కు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. ‘రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆల్కహాల్ సేవించినప్పుడు & ఉపవాసంలో ఉన్నప్పుడు ఈ మాత్రలు వేసుకోవద్దు. జలుబు/ఫ్లూ ట్యాబ్లెట్లలో కూడా పారాసిటమాల్ ఉంటుంది కాబట్టి రోజువారీ మోతాదును సరిచూసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News December 5, 2025
1000 ఇండిగో సర్వీసులు రద్దు.. సారీ చెప్పిన CEO

విమానాలు ఆలస్యంగా నడవడం, పలు సర్వీసుల రద్దుతో ఇబ్బందిపడిన వారందరికీ ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. విమాన సేవల్లో అంతరాయాన్ని అంగీకరిస్తున్నామని, 5 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఫ్లైట్ క్యాన్సిల్ సమాచారం అందుకున్న ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు వచ్చి ఇబ్బంది పడొద్దని కోరారు. నేడు వెయ్యికిపైగా సర్వీసులు రద్దవగా, సంస్థ తీసుకుంటున్న చర్యలతో రేపు ఆ సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది.


