News October 13, 2025
రూ.2లక్షలకు చేరువలో కిలో వెండి

కిలో వెండి ధర రూ.2లక్షల వైపు దూసుకెళ్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కేజీపై ఏకంగా రూ.5వేలు పెరిగి రూ.1,95,000గా ఉంది. అటు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.320 పెరిగి రూ.1,24,540కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రేటు రూ.300 పెరిగి రూ.1,14,950 పలుకుతోంది.
Similar News
News October 13, 2025
తాజా రౌండప్

* కోల్డ్రిఫ్ సిరప్ తయారీ సంస్థ శ్రీసన్ ఫార్మా అనుమతులు రద్దు చేస్తున్నట్లు తమిళనాడు డ్రగ్ నియంత్రణ విభాగం ప్రకటన
* ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన విశ్వనాథన్
* ఏడు రోజులైనా ఇంకా పూర్తికాని ఐపీఎస్ పూరన్ కుమార్ అంత్యక్రియలు.. పోస్టుమార్టానికి నిరాకరిస్తున్న భార్య అమనీత్
* ఇజ్రాయెల్‌కు ట్రంప్.. రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికిన ప్రధాని నెతన్యాహు
News October 13, 2025
అఫ్గాన్-పాక్ మధ్య సరిహద్దు వివాదమేంటి?

పాక్-అఫ్గాన్ మధ్య సరిహద్దుల్లో ‘డ్యూరాండ్ లైన్’ వెంబడి తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1893లో గీసిన ఈ లైన్‌పై ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. Durand Lineను అఫ్గాన్ ఒప్పుకోలేదు. PAK మాత్రం ఆ లైన్‌ను ‘అంతర్జాతీయ సరిహద్దు’ అంటోంది. ఈక్రమంలో తాలిబన్ పాలనలో వివాదం మళ్లీ మొదలైంది. తాలిబన్ ఫైటర్లు పాక్ పెట్టిన కంచెను తొలగించడంతో గొడవ ముదిరింది. దీంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి.
News October 13, 2025
నగలు నల్లగా మారాయా? ఇలా చేయండి

పండుగలు వస్తే చాలు మహిళలు భద్రంగా దాచుకున్న నగలను ఒక్కోటి బయటకు తీస్తారు. కానీ కొన్నిసార్లు ఈ నగలు నల్లగా మారి, మెరుపు తగ్గుతాయి. దీనికోసం కొన్ని టిప్స్ పాటించండి. * వేడినీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ వేసి నగలను నానబెట్టాలి. తర్వాత బ్రష్‌తో తోమితే మెరుపు తిరిగొస్తుంది. * బంగారుగాజులను నీటిలో నానబెట్టాలి. శనగపిండిలో వెనిగర్ కలిపి, మెత్తని పేస్టులా చేసి గాజులకు పట్టించి, కాసేపటి తర్వాత కడిగేయాలి.