News June 29, 2024

నాకౌట్ అంటే కోహ్లీకి పూనకాలే

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఇవాళ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 59 బంతుల్లో 76 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. గతంలోనూ నాకౌట్ స్టేజ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన ఘనత కోహ్లీదే. 2014 సెమీస్‌లో 72*(44), 2014 ఫైనల్ 77(58), 2016 సెమీస్ 89*(47), 2022 సెమీస్‌లో 50(40) పరుగులతో విరాట్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో నాకౌట్ స్టేజ్ అంటేనే కోహ్లీలో పూనకాలు వస్తాయంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Similar News

News November 17, 2025

క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రజాకవి అందెశ్రీకి మంత్రి మండలి సంతాపం తెలిపింది. ఈనెల 24లోపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

మృతులంతా హైదరాబాదీలే: TG హజ్ కమిటీ

image

సౌదీ <<18308554>>బస్సు ప్రమాద<<>> మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారేనని తెలంగాణ హజ్ కమిటీ స్పష్టం చేసింది. ‘4 ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న మొత్తం 45మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17మంది పురుషులు, 28మంది మహిళలున్నారు. చనిపోయినవారు మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందినవారు’ అని వెల్లడించింది.