News June 4, 2024

ఖమ్మంలో 2 లక్షలు దాటిన ఆధిక్యం

image

TG: ఖమ్మంలో కాంగ్రెస్ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. 16వ రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి 2.16లక్షల ఓట్ల ఆధిక్యం సాధించారు. దీంతో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

Similar News

News January 9, 2026

BJP కొత్త ఆయుధంగా సెన్సార్ బోర్డు: స్టాలిన్

image

సెన్సార్ బోర్డుపై తమిళనాడు CM స్టాలిన్ ఫైర్ అయ్యారు. CBI, ED, IT శాఖ మాదిరే ఇప్పుడు సెన్సార్ బోర్డు BJP కొత్త ఆయుధంగా మారిందని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ విషయంలోనే ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. మొత్తం 25కట్స్‌ సూచిస్తూ U/A సర్టిఫికెట్‌ను CBFC జారీ చేసింది. 1965 యాంటీ హిందీ ఆందోళన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి DMK సపోర్ట్ ఉంది.

News January 9, 2026

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో A-34గా ఉన్న TTD డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ACB కోర్టులో పిటిషన్ వేశారు. నెయ్యి క్వాలిటీ లేకున్నా ఆయన లంచాలు తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చారని ప్రభుత్వ లాయర్ వాదించారు. భోలేబాబా కంపెనీ నుంచి రూ.75లక్షలు, ప్రీమియర్ నుంచి రూ.8L, అల్ఫా నుంచి 8 గ్రా. గోల్డ్ తీసుకున్నట్లు సిట్ గుర్తించిందన్నారు. దీంతో కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

News January 9, 2026

పెద్దల పడక గది ఏ దిక్కున ఉండాలి?

image

ఇంటి పెద్దల పడకగది నైరుతి, వాయువ్య మూలల్లో ఉంటే మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. దక్షిణ, పడమర దిశలు కలిసే నైరుతి గది కుటుంబ యజమానికి అత్యంత సౌకర్యాన్ని, ప్రశాంతతను ఇస్తుందంటున్నారు. ‘ఈ దిశలో గాలి, వెలుతురు బాగా వస్తుంది. గాఢ నిద్రతో ఆరోగ్యం బాగుంటుంది. బాధ్యత గల పెద్దలకు ఈ దిశ చాలా అనుకూలం. ఇంటి అభివృద్ధిని కోరేవారు యజమానికై నైరుతి దిశ కేటాయించాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>