News April 14, 2024

ఆఫీసుకు రావాలని క్యాన్సర్ బాధితురాలికి లేఖ!

image

స్టేజ్-4 క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళను ఆఫీసుకు రమ్మని ఆమె పనిచేసే కంపెనీ బాస్ లేఖ రాయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు ఎంత ఫిట్‌గా ఉందో తెలుసుకునేందుకు వైద్యుల నుంచి లేఖ తేవాలని ఆమె కోరింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఓ మహిళ అయ్యి ఉండి తోటి మహిళతో ఇలా ప్రవర్తించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. క్యాన్సర్ బాధితురాలనే కనికరం లేకుండా ఆఫీసుకు రమ్మనడం సరికాదని మండిపతున్నారు.

Similar News

News April 14, 2026

ఇంజెక్షన్ల రీయూజ్.. పాక్‌లో 331 మంది చిన్నారులకు HIV!

image

పాకిస్థాన్‌లోని టౌన్సాలో THQ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చిన్నారులను బలితీసుకుంటోంది. ఇంజెక్షన్ల కోసం వాడిన సిరెంజ్‌లనే మళ్లీ ఉపయోగించడంతో
331 మంది చిన్నారులు HIV బారిన పడినట్లు బీబీసీ దర్యాప్తులో తేలింది. 2024 నవంబరు నుంచి 2025 అక్టోబరు మధ్య ఈ కేసులు నమోదయ్యాయి. కాగా వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యాజమాన్యం ఖండిస్తోంది.

News April 14, 2026

సీఎం పదవికి నితీశ్ రాజీనామా

image

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను గవర్నర్‌కు అందజేశారు. మరికాసేపట్లో బీజేపీ కొత్త సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనుంది. బిహార్‌కు నితీశ్ 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లు ఉండగా NDAకు 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

News April 14, 2026

PSL.. ముజరబానీపై రెండేళ్లపాటు నిషేధం

image

ZIM బౌలర్ ముజరబానీపై PSL రెండేళ్లపాటు నిషేధం విధించింది. PSLలో ఆడాల్సిన ఆయన, ఆ ఒప్పందాన్ని కాదని IPLలో ఆడేందుకు KKR జట్టులో చేరారు. ఇలా చేయడం ప్రొఫెషనలిజం కాదని, అందుకే వచ్చే 2 సీజన్లలో ఆడకుండా బ్యాన్ చేస్తున్నట్లు PSL ప్రకటించింది. MI ప్లేయర్ బాష్‌‌‌నూ గత సీజన్లో ఏడాదిపాటు నిషేధించింది. కాగా IPL కోసం PSL నుంచి తప్పుకున్న వారిలో శనక, స్పెన్సర్ జాన్సన్ కూడా ఉన్నారు. వారినీ బ్యాన్ చేసే ఛాన్సుంది.