News March 1, 2025
సంక్రాంతికి వస్తున్నాం OTTలో చిన్న ట్విస్ట్!

ఇవాళ OTTలోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రన్ టైమ్ తగ్గింది. థియేటర్లో 2గం. 24ని.లు స్క్రీన్ అయిన ఈ సినిమా జీ5లో 2గం. 16 ని.లే అందుబాటులో ఉంది. రన్ టైమ్ కారణంగా థియేటర్ వెర్షన్లో కట్ చేసిన కొన్ని సీన్లను OTTలో యాడ్ చేస్తారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే కొసరు మాట పక్కనబెడితే అసలుకే కత్తెరేశారు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 2, 2025
ఈనెల 8న కొత్త పథకాలు ప్రారంభం: మంత్రి సీతక్క

TG: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ రోజున CM రేవంత్ కొత్త పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. RTCకి అద్దెకు ఇచ్చే మహిళా సంఘాలకు చెందిన 50 బస్సులను ప్రారంభిస్తారని, 14,236 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.
News March 2, 2025
వైసీపీ శ్రేణులకు పనులు, సాయం చేయొద్దు: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ శ్రేణులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి పనులూ చేయొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వారికి సాయం చేస్తే పాముకు పాలు పోసినట్లేనన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు గట్టిగా చెబుతున్నానంటూ హెచ్చరించారు. జీడీ నెల్లూరు కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని సూచించారు. నాయకులు తన చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలన్నారు.
News March 2, 2025
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ATC: CM

TG: రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్(ITI)లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు(ATC)గా అప్గ్రేడ్ చేయడంపై CM రేవంత్ సమీక్షించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక ATC ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ITIలు లేని కేంద్రాల్లో కొత్తగా ATCలను ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాలు/పట్టణాలకు సమీపంలో ATCలు ఉండేలా చూడాలని, అవసరమైన నిధులను అందిస్తామని చెప్పారు.