News October 19, 2024

ఒక్క బాంబు బెదిరింపు కాల్‌తో రూ.3 కోట్ల నష్టం

image

బాంబు బెదిరింపు కాల్స్‌తో ఎయిర్‌లైన్స్ కంపెనీల చమురు వదులుతోంది! ఒక్కో నకిలీ కాల్ వల్ల రూ.3 కోట్ల వరకు నష్టపోతున్నట్టు అంచనా. దారి మళ్లిస్తే అదనపు ఫ్యూయల్ కోసం రూ.కోటి వరకు ఖర్చవుతోంది. ఇక ఫ్లైట్ ల్యాండింగ్, ఎయిర్‌పోర్ట్ పర్మిషన్లు, ప్రయాణికులకు లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, ఇతర అవసరాలకు మరో రూ.2కోట్లు కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 40 ఫేక్ కాల్స్ వల్ల కంపెనీలపై రూ.60-80కోట్ల అదనపు భారం పడింది.

Similar News

News October 19, 2024

రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోంది: బండి సంజయ్

image

TG: గ్రూప్-1 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి ర్యాలీ చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రం మొత్తం అగ్గి రగులుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు ర్యాలీలో BJP, BRS కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

News October 19, 2024

‘మూసీ’కి డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?: KTR

image

TG: రైతు భరోసా అమలు చేసే వరకూ కాంగ్రెస్‌ను వదిలేది లేదని KTR అన్నారు. ‘కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధు ఇవ్వదన్న KCR మాటలను రేవంత్ సర్కార్ నిజం చేసింది. స్వయంగా వ్యవసాయశాఖ మంత్రే చేతులేస్తున్నట్లు ప్రకటించారు. డబ్బుల్లేక సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయి కానీ రైతు భరోసాకు లేవా?’ అని ప్రశ్నించారు. రేపు అన్ని మండలాల్లో ఆందోళనలు చేయాలని BRS శ్రేణులకు పిలుపునిచ్చారు.

News October 19, 2024

నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

image

TG: మార్పు కావాలనే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గోషామహల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరుకే ప్రతి నియోజకవర్గానికి 3500-4000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని నొక్కి చెప్పారు. అర్హత ఉంటే ఎలాంటి రికమండేషన్ అవసరం లేదన్నారు. రాబోయే నాలుగున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.