News July 13, 2024

ఆ సమయంలో ఎంతో బాధపడ్డా: అలీ ఫజల్

image

తాను నటుడిని కావాలని ఎప్పుడూ అనుకోలేదని మీర్జాపూర్ సిరీస్ నటుడు అలీ ఫజల్ అన్నారు. తానొక బాస్కెట్‌బాల్ ప్లేయర్‌నని.. దేశం తరఫున ఆడాలనేది తన లక్ష్యంగా ఉండేదని తెలిపారు. అయితే స్కూల్ డేస్‌లో భుజానికి అయిన తీవ్ర గాయం కారణంగా ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని అన్నారు. ఆ తర్వాత నటనవైపు అడుగులు వేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Similar News

News April 2, 2026

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లకు నేడే లాస్ట్

image

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ఒకటో తరగతితో పాటు బాల వాటికల్లో ప్రవేశాలకు https://kvsangathan.nic.in/లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు.

News April 2, 2026

వివాహేతర డేటింగ్ యాప్స్‌.. పెరుగుతున్న మహిళా యూజర్లు!

image

దేశంలో వివాహ బంధాల తీరు మారుతోంది. ఒక ప్రముఖ వివాహేతర డేటింగ్ యాప్ రిపోర్ట్ ప్రకారం భారత్‌లో మహిళా యూజర్ల సంఖ్య రెండేళ్లలో 148% పెరిగింది. మోడ్రన్ లైఫ్‌స్టైల్, ఎమోషనల్‌గా సంతృప్తి లేకపోవడం వల్ల పెళ్లి తర్వాత బయటి సంబంధాల కోసం వెతుకుతున్నారని తేలింది. టెక్నాలజీ పుణ్యమా అని ‘సీక్రెట్ అఫైర్స్’ ఈజీ అవ్వడంతో వివాహ వ్యవస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News April 2, 2026

పెరిగిన ఎండలు – రైతులకు సూచనలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఈ తరుణంలో పంటల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఎండ వేడి నుంచి నేల ఉష్ణోగ్రతను తగ్గించడానికి మొక్కల చుట్టూ ఎండిన ఆకులు, వరి గడ్డి లేదా సేంద్రీయ వ్యర్థాలను మల్చింగ్‌గా వేయాలి. దీని వల్ల నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నిపుణుల సూచన మేరకు పంట దశను బట్టి నీటిని తప్పక అందించాలి.