News December 22, 2024
రాష్ట్రంలో తప్పిన పెను రైలు ప్రమాదం
AP: విశాఖ రైల్వే స్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. TN నుంచి బెంగాల్ వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తె.జామున విశాఖ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైనున్న విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. సిబ్బంది వెంటనే విద్యుత్‌ను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది విద్యుత్‌ను పునరుద్ధరించి రాకపోకలను తిరిగి ప్రారంభించారు.
Similar News
News December 22, 2024
దురుసుగా ప్రవర్తిస్తే బౌన్సర్ల తాట తీస్తాం: సీపీ
TG: పబ్లిక్‌తో సెలబ్రిటీల బౌన్సర్లు దురుసుగా ప్రవర్తిస్తే వారి తాట తీస్తామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బౌన్సర్ల విషయంలో సెలబ్రిటీలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ‘ఎక్కడైనా బౌన్సర్లు ఓవరాక్షన్ చేస్తే చర్యలు తప్పవు. జనాలను తోయడం, కొట్టడం, దూషించడం వంటివి చేయకూడదు. ఏజెన్సీలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బౌన్సర్ల నియామకంలో జాగ్రత్త వహించాలి’ అని సీపీ హెచ్చరించారు.
News December 22, 2024
స్మృతి మంధాన మరో ఘనత
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించారు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ఆమె నిలిచారు. ఈ ఏడాది ఆమె 1,602 పరుగులు చేశారు. ఈ క్రమంలో లారా వాల్వడర్ట్(1,593)ను అధిగమించారు. విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆమె ఈ ఫీట్ సాధించారు. కాగా ఈ మ్యాచులో స్మృతి (91) కొద్దిలో శతకం చేజార్చుకున్నారు. జేమ్స్ బౌలింగ్‌లో ఆమె వికెట్ల ముందు దొరికిపోయారు.
News December 22, 2024
అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
TG: సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారని బన్నీ మాట్లాడటం సరికాదన్నారు. ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమని చెప్పారు. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటి? సూపర్ స్టార్ అయితే ఏంటి? అని ప్రశ్నించారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు.