News February 11, 2025

చనిపోయాడని నిర్ధారించిన వ్యక్తి మళ్లీ బతికాడు!

image

చచ్చి బతికాడ్రా? అని వింటుంటాం. అలాంటి ఘటనే కర్ణాటకలోని హవేరీలో జరిగింది. బిష్టప్ప అనే వ్యక్తి దీర్ఘకాలిక కాలేయ సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యం అందించినా చలనం లేకపోవడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇంటి దగ్గర అంత్యక్రియలకు ఏర్పాటు చేసి, పోస్టర్లు అంటించారు. అయితే, ఇంటికి తీసుకెళ్తుండగా శ్వాస తీసుకోవడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

Similar News

News January 20, 2026

మెట్రో ఫేజ్-2: కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్ లేఖ

image

TG: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న మెట్రో ఫేజ్-2కు వీలైనంత త్వరగా అనుమతులు ఇప్పించాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి CM రేవంత్ లేఖ రాశారు. ఇదే విషయమై కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. గతంలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌నూ కలిసినట్లు గుర్తుచేశారు. ఫేజ్-2 నిర్మాణం కోసం కేంద్రం నుంచి ఇద్దరు అధికారులతో కూడిన సంయుక్త కమిటీ ఏర్పాటును CM లేఖలో ప్రస్తావించారు.

News January 20, 2026

సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా: హరీశ్ రావు

image

TG: సిట్ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వెళ్తానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘విచారణకు పిలిచి గంట ప్రశ్నలు అడగడం.. కాసేపు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్లడం చేశారు. కోల్ మైన్ విషయంలో రేవంత్, భట్టి, కోమటిరెడ్డి మధ్య పంపకాల్లో తేడా వచ్చింది. ఈ అంశం డైవర్ట్ చేయడానికే డ్రామా ఆడుతున్నారు. దర్యాప్తు పేరుతో ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సీఎం రేవంత్ భాష వింటే రోత పుడుతోంది’ అని ఆయన అన్నారు.

News January 20, 2026

నం.3లో ఇషాన్ కిషన్ ఆడతారు: సూర్య

image

రేపు NZతో జరిగే తొలి T20లో ఇషాన్ కిషన్ నం.3లో బ్యాటింగ్ చేస్తారని కెప్టెన్ SKY తెలిపారు. శ్రేయస్ కంటే ముందే బ్యాటింగ్ చేయడానికి అతను అర్హుడన్నారు. మరోవైపు తన ఆటతీరులో మార్పు ఉండదని, గతంలో మాదిరే బ్యాటింగ్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. రేపటి నుంచి NZతో IND 5 మ్యాచుల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో 7PMకు ప్రారంభమవుతుంది. JIO హాట్‌స్టార్, స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో LIVE చూడొచ్చు.