News November 7, 2024

ధ్రువ్ జురెల్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్

image

ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఇండియా ఏ ఆటగాడు ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. జట్టు 11 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడారు. 186 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత కాసేపటికే భారత్ 161 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4, వెబ్‌స్టర్ 3 వికెట్లు తీశారు.

Similar News

News November 7, 2024

STOCK MARKETS: రూ.3.5లక్షల కోట్ల నష్టం

image

స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. US FED వడ్డీరేట్ల కోతపై నిర్ణయం, US బాండ్ యీల్డుల పెరుగుదల, డాలర్ బలపడటం, FIIల పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 79,638 (-739), నిఫ్టీ 24,218 (-265) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3.5లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. హిందాల్కో 8%, ట్రెంట్, గ్రాసిమ్ 3%, Adanient, TechM 2.5% మేర నష్టపోయాయి.

News November 7, 2024

ఓటీటీలోకి వచ్చేసిన సమంత ‘సిటాడెల్: హనీ బన్నీ’

image

సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీల కోసం నిన్న ముంబైలో ప్రివ్యూ షో వేయగా షాహిద్ కపూర్, అర్జున్ కపూర్, కృతిశెట్టి, సందీప్ కిషన్ తదితరులు వీక్షించారు. అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ అంటూ కితాబిచ్చారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌లో కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు నటించారు.

News November 7, 2024

ట్రంప్ విజయం.. మస్క్‌కు ₹2.2లక్షల కోట్లు లాభం

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను పొందాయి. దీంతో ఐదుగురు బిలియనీర్లు దాదాపు 53 బిలియన్ డాలర్లు లాభపడ్డారు. ముఖ్యంగా ట్రంప్‌కు మద్దతుగా ప్రచారానికి $119 మిలియన్లు విరాళమిచ్చిన ఎలాన్ మస్క్ ఒక్కరోజులో $26.5 బిలియన్లు (రూ.2.2లక్షల కోట్లు) లాభపడ్డారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నికర విలువ $26.5B పెరిగి $290 బిలియన్లకు చేరింది.