News May 8, 2024
గుర్తుండిపోయే రోడ్ షో: మోదీ

AP: విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో ముగిసింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌తో విజయవాడలో చేసిన రోడ్ షో గుర్తుండిపోతుందని ప్రధాని ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఏపీలో పర్యటించిన తర్వాత ప్రజలు ఎన్డీఏకు ఓటు వేస్తారని విశ్వసిస్తున్నట్లు మోదీ తెలిపారు. మహిళలు, యువ ఓటర్లు తమకు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.
Similar News
News February 15, 2026
కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం రీఓపెన్ ఎప్పుడంటే?

12 జ్యోతిర్లింగాలలో ఒకటి, చార్‌ధామ్ యాత్రలో భాగమైన ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ రీఓపెన్ తేదీని ఆ రాష్ట్ర CM పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. ఏప్రిల్ 22 నుంచి శివుడిని దర్శించుకోవచ్చని చెప్పారు. అందుకు తగ్గట్లు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విపరీతమైన మంచు వల్ల ఆలయాన్ని గతేడాది అక్టోబర్ 23న మూసేశారు. కేదార్‌నాథ్ టెంపుల్ సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
News February 15, 2026
సమ్మర్ ఎంటర్.. ఏసీలు సర్వీసింగ్ చేయిస్తున్నారా?

తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం దాదాపు ముగిసిపోయి సమ్మర్ ఎంటరైంది. దీంతో ఏసీల వాడకానికి టైమ్ వచ్చేసింది. అయితే ముందుగా వాటిని సర్వీసింగ్ చేయించాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే కూలింగ్ సరిగా ఇవ్వకపోగా పవర్ బిల్ షాక్ ఇస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లను శుభ్రం చేయడం, గ్యాస్ లీక్‌లను టెక్నీషియన్లతో చెక్ చేయించాలని సూచిస్తున్నారు. ఏటా రెండు సార్లైనా సర్వీసింగ్ చేయించాలంటున్నారు.
News February 15, 2026
పశువులకు ‘జోన్స్’ వ్యాధి ఎలా సోకుతుంది?

పాడి పశువులు సాధారణంగా మురికినీరు, శుభ్రంగా లేని మేత తీసుకోవడం వల్ల జోన్స్ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి అన్ని రకాల పశువులకు సోకుతుంది. సాధారణంగా గేదెల్లో రెండు ఈతల తర్వాత ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లికి ఈ వ్యాధి ఉంటే పుట్టే దూడకు సోకుతుంది. దీంతోపాటు సహజ, కృత్రిమ సంపర్కం ద్వారా కూడా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది. సహజంగా పశువుల్లో రోగ నిరోధక శక్తి తగ్గినపుడు ఈ వ్యాధి వస్తుంది.


