News October 8, 2024

విజయ్ చివరి సినిమాలో గుర్తుండిపోయే సాంగ్!

image

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించనున్న చివరి సినిమా ‘Thalapathy69’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ‘SIIMA’ షేర్ చేసింది. ఈ చిత్రంలో ‘వన్ లాస్ట్ సాంగ్’ అని సాగే ఓ పాటను గ్రాండ్‌గా చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. 500 మంది డాన్సర్లు పాల్గొనే ఈ సాంగ్‌కు అసల్ కోలార్ లిరిక్స్ అందించనున్నట్లు పేర్కొంది. మాస్ స్టెప్పులతో అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.

Similar News

News April 6, 2026

ట్రంప్: ముందు బెదిరింపు.. తర్వాత పొడిగింపు!

image

ఇరాన్‌తో యుద్ధంపై US అధ్యక్షుడు ట్రంప్ రోజుకో తీరున ప్రకటన చేస్తూ నవ్వులపాలవుతున్నారు. డీల్ చేసుకోవాలని డెడ్‌లైన్ విధించడం, తర్వాత పొడిగించడం మామూలైపోయింది. మార్చి 21 నుంచి 5సార్లు ఇలానే చేశారు. 48 గంటల్లో హార్ముజ్‌ను తెరవకపోతే <<19577288>>విధ్వంసం<<>> చేస్తామని ప్రకటించి మరుసటి రోజే గడువును 82 గంటలకు పొడిగించామని చెప్పారు. ఆయన డెడ్‌లైన్లు ఆయిల్ ధరల కంటే వేగంగా మారుతున్నాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

News April 6, 2026

IPL: చెన్నై పని అయిపోయిందా?

image

అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 5 టైటిల్స్ గెలిచిన చెన్నై.. ఇప్పుడు వరుస ఓటములతో తుస్సుమంటోంది. 200+ టార్గెట్‌ను కాపాడుకోవాలన్నా, 200కు పైగా ఛేజ్ చేయాల్సి ఉన్నా చేతులెత్తేస్తోంది. టీమ్ బ్యాలెన్స్ సరిగా లేదని, బౌలర్లు తేలిపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ధోనీ వస్తే పరిస్థితి మారుతుందని కొందరు అంటున్నారు. జట్టు బాగాలేనప్పుడు ఎవరు వచ్చినా ఏమీ చేయలేరని మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు. COMMENT?

News April 6, 2026

కృతి శెట్టి.. ఈసారైనా హిట్టు కొడతావా క్యూటీ!

image

‘ఉప్పెన’తో తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్ కొట్టిన కృతిశెట్టికి సరైన హిట్లు పడటం లేదు. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ మినహా తర్వాత చేసిన 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా ప్రదీప్ రంగనాథన్‌‌‌‌తో ఆమె చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ ఈ నెల 10న రిలీజవుతోంది. ఇదైనా హిట్ అవుతుందేమో చూడాలి. కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకీ-కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు.