News March 18, 2024
ప్రియుడితో కలిసి కప్పుతో ఫోజుచ్చిన స్మృతి

WPL రెండో సీజన్ విజేతగా ఆర్సీబీ నిలిచింది. కాగా ప్రియుడు పలాస్ ముచ్చల్తో కలిసి ట్రోఫీతో కెప్టెన్ స్మృతి మంధాన ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. వీలుచిక్కినప్పుడల్లా వీరు విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పలాస్ బాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్నారు. ఓ ఈవెంట్లో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.
Similar News
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.
News November 22, 2025
మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.


