News December 1, 2024

132 ఏళ్ల సీసాలో సందేశం.. ఇప్పుడు దొరికింది!

image

132 ఏళ్ల క్రితం గాజు సీసాలో పెట్టిన సందేశమది. స్కాట్లాండ్‌లోని కోర్స్‌వాల్ లైట్‌హౌస్‌ పనితీరును ఓ మెకానికల్ ఇంజినీర్ సమీక్షిస్తుండగా గోడల్లో బయటపడింది. 1892, సెప్టెంబరు 4న ఆ లైట్‌హౌస్‌ను నిర్మించిన ముగ్గురు ఇంజినీర్లు తమ పేర్లను, ముగ్గురు సిబ్బంది పేర్లను రాసిన కాగితాన్ని సీసాలో పెట్టి గోడలో భద్రపరిచారు. అది ఇన్నేళ్లకు వెలుగుచూసింది. దాన్ని కనుగొన్న అధికారులు వారూ ఓ సీసాను పెట్టాలనుకుంటున్నారు.

Similar News

News March 8, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 8)

image

1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1989: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతి
2012: సినీ నటి రాధాకుమారి మరణం
☛ అంతర్జాతీయ మహిళా దినోత్సవం

News March 8, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 8, 2026

ఈరోజు నమాజ్ వేళలు (08-3-2026) ఆదివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.18 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.