News November 29, 2024

రాష్ట్రానికి తప్పిన ముప్పు

image

ఏపీకి తుఫాను ముప్పు లేదని వాతావరణ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందలేదని, ఇది ఈ సాయంత్రం వరకు వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. రేపు ఉదయం కల్లా కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని చెప్పారు. తుఫాన్ ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Similar News

News October 18, 2025

బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

image

భారతదేశపు బంగారం నిల్వల విలువ మొదటిసారిగా $100 బిలియన్ మైలురాయిని అధిగమించింది. మొత్తంగా $102 బిలియన్లు దాటినట్లు RBI డేటా పేర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇదెంతగానో బలం చేకూర్చనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం RBI విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 14.7% కి చేరింది.

News October 18, 2025

రేపే తొలి వన్డే.. ట్రోఫీతో కెప్టెన్లు

image

భారత్ vs ఆసీస్ వన్డే సిరీస్ రేపు ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా కెప్టెన్లు గిల్, మార్ష్ ట్రోఫీ లాంచ్ చేసి ఫొటోలకు పోజులిచ్చారు. కెప్టెన్‌గా గిల్‌కిది తొలి వన్డే సిరీస్ కాగా, AUSలోని బౌన్సీ పిచ్‌‌లు తన సారథ్యానికి సవాలు విసరనున్నాయి. మరోవైపు అందరి దృష్టి RO-KOలపై ఉంది. వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకునేందుకు ఈ సిరీస్ వారికి కీలకం అయ్యే ఛాన్సుంది. తొలి వన్డే రేపు పెర్త్‌ వేదికగా జరగనుంది.

News October 18, 2025

ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

image

AP: ఏజెన్సీల్లోని గురుకుల విద్యార్థులను విషజ్వరాలు వణికిస్తున్నాయి. కురుపాం స్కూళ్లో 150 మందికి పైగా జాండీస్ సోకగా ఇద్దరు మరణించడం తెలిసిందే. తాజాగా సాలూరు ఇతర ప్రాంతాల్లో 2900 మందికి వైద్య పరీక్షలు చేయగా 21మంది జ్వరాలున్నట్లు తేలింది. జాండీస్, మలేరియా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. స్కూళ్లలో పారిశుధ్య లోపం, ఏళ్లతరబడి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయకపోవడమే వీటికి కారణమని పేర్కొంటున్నారు.