News April 6, 2024

లోకల్ vs నాన్ లోకల్ పోస్టర్ల కలకలం

image

TG: మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలో మూడు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఈ పార్లమెంట్‌లో తాజాగా లోకల్, నాన్ లోకల్ అంశం తెరపైకి వచ్చింది. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ‘బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కి.మీ, కాంగ్రెస్ అభ్యర్థి సునీతను కలవాలంటే 59 కి.మీ దూరం వెళ్లాలి. అదే బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిని కలవాలంటే 0 కి.మీ. పక్కా లోకల్’ అంటూ అందులో రాసుంది.

Similar News

News October 8, 2024

4 రాష్ట్రాల్లో బీజేపీ హ్యాట్రిక్

image

హరియాణా ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో వరుసగా మూడు సార్లు ఏ పార్టీ గెలవలేదు. తాజాగా దాన్ని బీజేపీ సుసాధ్యం చేసింది. ఇంతకుముందు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా రాష్ట్రాల్లో కమలం హ్యాట్రిక్ నమోదు చేసింది. తాజాగా ఆ లిస్టులో హరియాణా చేరింది.

News October 8, 2024

ప్రధాని మోదీ నాయకత్వం వల్లే ఈ విజయం: పవన్ కళ్యాణ్

image

హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించినందుకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ప్రధాని మోదీ నాయకత్వం, ప్రజా సంక్షేమంపై దృష్టి, ఆయనకున్న ప్రజల మద్దతును మరోసారి చాటి చెప్పిందని అన్నారు. హరియాణా, జమ్మూ&కశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.

News October 8, 2024

ఇండియా ఏతో టీమ్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందు ఇండియా ఏ జట్టుతో టీమ్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుందని సమాచారం. కాగా ఇండియా ఏ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా ఉన్నారు. జట్టు: మయాంక్ అగర్వాల్, ప్రాతమ్ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, శాశ్వత్ రావత్, కుమార్ కుశాగ్ర, షామ్స్ ములానీ, తనుష్ కొఠియాన్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, అఖీబ్ ఖాన్.