News March 1, 2025
ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్: మంత్రి లోకేశ్

AP: <<14566229>>అపార్ ఐడీ<<>> ద్వారా KG- PG వరకు విద్యార్థుల పురోగతిని ట్రాక్ చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఓ మోడల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. PG ఫీజు రీయింబర్స్మెంట్ అమలుకు విధివిధానాలు రూపొందించాలని, అమరావతిలో AI, స్పోర్ట్స్ వర్సిటీల పనులను వేగవంతం చేయాలని సూచించారు. వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.
Similar News
News December 7, 2025
SRPT: పోస్టల్ బ్యాలెట్ విధిగా వినియోగించుకోవాలి: కలెక్టర్

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను విధిగా వినియోగించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆయన కోరారు. ఆత్మకూరు (ఎస్), సూర్యాపేట సహా 8 మండలాల ఉద్యోగులు ఈ నెల 6 నుంచి 9వ తేదీలలో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు వేయాలని స్పష్టం చేశారు.
News December 7, 2025
ALERT.. రేపటి నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 18 జిల్లాల్లో 9-12డిగ్రీలు, 12 జిల్లాల్లో 6-9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.
News December 7, 2025
సమ్మిట్ ఆహూతులకు స్పెషల్ బొనాంజా

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. 44 దేశాలనుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. రేపు 1.30కు సమ్మిట్‌ను గవర్నర్ ప్రారంభిస్తారు. CM 2.30కు ప్రసంగిస్తారు. TG సంస్కృతి, HYD ఆధునికత ఉట్టిపడేలా ప్రతినిధులకు స్వాగతం, ప్రసిద్ధ వంటకాలతో ఆతిథ్యం అందిస్తారు. సమ్మిట్ ఎప్పటికీ గుర్తుండేలా ప్రత్యేక సావనీర్, వివిధ పిండివంటలతో కూడిన బాస్కెట్‌ను ఆహూతులకు అందించనున్నారు.


