News September 10, 2025
శ్రీనువైట్ల, నితిన్ కాంబోలో సినిమా?

గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలు లేని హీరో నితిన్, డైరెక్టర్ శ్రీనువైట్ల కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల ‘తమ్ముడు’తో ఫెయిల్యూర్ చూసిన నితిన్.. ప్రస్తుతం ‘బలగం’ వేణుతో ‘ఎల్లమ్మ’ మూవీ చేస్తున్నారు. అటు శ్రీనువైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
Similar News
News September 10, 2025
ఈ నెల 15న మెగా డీఎస్సీ తుది జాబితా?

AP: 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే 19న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ సభలోనే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్త టీచర్లకు దసరా సెలవుల్లో ట్రైనింగ్, కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తారని, సెలవుల అనంతరం స్కూళ్లు పున ప్రారంభం రోజున వారంతా విధుల్లో చేరతారని సమాచారం.
News September 10, 2025
మళ్లీ భారీ వర్షాలు

TG: నేటి నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలవనున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
News September 10, 2025
ఈ కారు ధర రూ.30 లక్షలు తగ్గింది

జీఎస్టీ కొత్త శ్లాబుల నేపథ్యంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కారు ధర ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మోడళ్లను బట్టి ఈ కారు ప్రైజ్ రూ.4.5లక్షల నుంచి రూ.30.4లక్షలు తగ్గడం విశేషం. అయితే రేంజ్ రోవర్ బేసిక్ మోడల్ రేటు రూ.2 కోట్లకు పైమాటే. ఇక ఇదే కంపెనీకి చెందిన డిఫెండర్‌పై రూ.7-రూ.18.60 లక్షలు, డిస్కవరీపై రూ.4.5-రూ.9.90 లక్షల మేర తగ్గింపు వర్తించనుంది.