News August 8, 2024

మహేశ్ బాబుతో సినిమా.. హరీశ్ శంకర్ ఏమన్నారంటే?

image

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘పోకిరి’ లాంటి సినిమా చేయాలని ఉందని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. ‘పోకిరి’ తనకు టెక్ట్స్ బుక్ వంటిదని చెప్పారు. ఇప్పటివరకూ మహేశ్‌కు స్టోరీ ఏమీ చెప్పలేదన్నారు. ‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. మరోవైపు పవన్ కళ్యాణ్-రవితేజ కాంబినేషన్లో సినిమా తీయాలని ఉందని చెప్పారు. పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అవ్వవని, తన స్టైల్ సినిమాలు చేస్తానని తెలిపారు.

Similar News

News April 6, 2026

IPL: ఈరోజైనా KKR బోణీ కొడుతుందా?

image

ఐపీఎల్-2026లో ఈరోజు రా.7.30 గంటలకు కోల్‌కతా వేదికగా KKR, PBKS తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచులు ఆడగా 21 విజయాలతో KKR పైచేయి సాధించింది. కానీ ప్రస్తుత సీజన్‌లో KKR ఫామ్‌లో లేదు. ఇప్పటివరకు రెండు మ్యాచులాడి రెండింట్లోనూ ఓడింది. అటు పంజాబ్ ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది. మరి ఈరోజు విజయం ఎవరిదో కామెంట్ చేయండి.

News April 6, 2026

లేఆఫ్స్‌ వద్దు.. రీస్కిల్లింగ్‌పై దృష్టి పెట్టండి: NITES

image

టెక్ కంపెనీలు లేఆఫ్స్‌కు బదులు ఉద్యోగుల స్కిల్స్‌ను పెంచడంపై దృష్టి పెట్టాలని IT ఉద్యోగుల సంఘం ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ అభిప్రాయపడింది. లేఆఫ్స్‌ను చివరి ఆప్షన్‌గా చూడాలంది. ప్రైవేట్ సెక్టార్‌లో లే ఆఫ్స్, నోటీస్ పీరియడ్స్, పరిహారాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవని, ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడాలని సంఘం ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా కోరారు.

News April 6, 2026

ఒక్కరోజే 51 లక్షల సిలిండర్ల విక్రయం: కేంద్రం

image

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇప్పటివరకు 5 కేజీల సిలిండర్లు 6.6 లక్షలు అమ్ముడైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎలాంటి కొరత లేదని, ఏప్రిల్ 4న ఒక్క రోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయని తెలిపింది. మార్చి నుంచి ఇప్పటివరకు అక్రమంగా నిల్వ చేసిన 50వేలకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.