News May 22, 2024
A.N.U ఇంజినీరింగ్ ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష తేదీ గడువు పొడిగించారు. జూన్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, బీటెక్, ఎంటెక్ కోర్సులలో చేరేందుకు ఈ పరీక్షలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News October 14, 2025
SNపాడులో 17న జాబ్ మేళా..!

SNపాడులోని DMSVK మహిళా కళాశాలలో ఈనెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజలు తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను మంగళవారం కలెక్టర్ రాజాబాబు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. 18 నుంచి 35ఏళ్ల వయసు గల నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు తెలిపారు.
News October 14, 2025
గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ఒంగోలు పాత ZPHS సమావేశ మందిరంలో ఒంగోలు డివిజన్ పంచాయతీ కార్యదర్శులతో భౌతిక సమీక్షా సమావేశాన్ని డీపీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజబాబు, హాజరై పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్య చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, పారిశుద్ధ్యంలో ప్రకాశం జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు.
News October 14, 2025
ప్రకాశంలో ఒక్కరోజే ఐదుగురి మృతి

ప్రకాశంలో నిన్న విషాద ఘటనలు జరిగాయి. ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున బస్సు బోల్తా పడి ఒకరు చనిపోగా, 13మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా రిమ్స్ నుంచి మరో వైద్యశాలకు తరలించారు. <<17997659>>CSపురం<<>>, <<17998375>>కొనకనమిట్ల <<>>వద్ద రాత్రి గంటల వ్యవధిలో రెండు ప్రమాదంలో జరిగాయి. ఆ రెండు ఏరియాల్లో ఇద్దరేసి చొప్పున నలుగురు ప్రాణాలు వదిలారు.