News August 17, 2024

వాతావరణం నుంచి CO2ను లాగేసేలా కొత్త బయోమెటీరియల్

image

వాతావరణంలోని CO2ను వెలికితీసేందుకు సజీవ సూక్ష్మజీవులను ఉపయోగించే కన్‌స్ట్రక్షన్ బయోమెటీరియల్‌ను భారత విద్యార్థి ప్రంతర్ అభివృద్ధి చేస్తున్నారు. అతను యూనివర్సిటీ కాలేజ్ లండన్(UCL)లో బయోకెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నారు ‘ఈ మెటీరియల్‌ను భవనాల లోపలి గోడలపై అమర్చితే కిరణజన్య సంయోగక్రియ ద్వారా CO2ను లాగేస్తుంది. మానవ నివాసాలను కార్బన్ రహిత ప్రదేశాలుగా మార్చడమే లక్ష్యం’ అని అతను తెలిపారు.

Similar News

News July 6, 2025

విజయానికి 5 వికెట్లు

image

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఐదో రోజు భారత బౌలర్ ఆకాశ్‌దీప్ అదరగొడుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 5 ఓవర్లకే రెండు కీలక వికెట్లు తీశారు. పోప్(24), బ్రూక్(23)ను ఔట్ చేశారు. దీంతో ఇంగ్లండ్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ 4 వికెట్లు, సిరాజ్ ఒక వికెట్ తీశారు. ENG స్కోరు 83/5. ఇంకా 5 వికెట్లు తీస్తే భారత్‌దే విజయం.

News July 6, 2025

ఆట ప్రారంభం.. 10 ఓవర్ల కోత

image

ఐదో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నరకు‌పైగా నిలిచిన భారత్ VS ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆట ప్రారంభమైంది. 80 ఓవర్లు నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. అటు ఇంగ్లండ్ కష్ట సాధ్యమైన 536 పరుగులు ఛేదించాల్సి ఉంది. దీంతో ఆ జట్టు డ్రా కోసమే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ENG స్కోరు 72/3. క్రీజులో పోప్(24), బ్రూక్(15) ఉన్నారు.

News July 6, 2025

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం?

image

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కిట్‌పై వివాదం నెలకొంది. భారత జట్టుకు ప్రస్తుతం అడిడాస్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. కానీ నిన్న ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయంలో గిల్ నైక్ టీ షర్ట్ ధరించారు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. మ్యాచ్ జరిగే సమయంలో స్పాన్సర్ కిట్‌ను కాదని ఇతర కిట్స్ ఉపయోగించడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.