News November 24, 2024

WhatsAppలో కొత్త ఫీచర్.. ఇక సీక్రెట్‌గా చదువుకోవచ్చు

image

ఆడియో సందేశాల‌ను Text రూపంలోకి మార్చే కొత్త ఫీచ‌ర్‌ వాట్సాప్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. కీల‌క స‌మావేశాల్లో ఉన్న‌ప్పుడు వ‌చ్చే ఆడియో సందేశాలు, ఎవ‌రూ విన‌కూడ‌ద‌నుకున్న వాటిని టెక్ట్స్ రూపంలోకి క‌న్వ‌ర్ట్ చేసుకొని చ‌దువుకోవ‌చ్చు. దీనిని Settings-Chats-Transcription ఆప్ష‌న్‌ను ఉప‌యోగించి ఎనేబుల్ చేసుకోవ‌చ్చు. అనంత‌రం ఆడియో మెసేజ్‌ల‌పై లాంగ్ ప్రెస్ చేసి Text ఫార్మాట్‌లోకి మార్చుకోవ‌చ్చు.

Similar News

News November 22, 2025

మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయండి: అదనపు కలెక్టర్

image

గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్‌లలో కనీస వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ అధికారిణి నిఖిలతో కలిసి శనివారం ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్స్‌లో విద్యుత్, తాగునీరు, వికలాంగులు, వృద్ధులకు ర్యాంప్ సౌకర్యం వసతులు పరిశీలన చేసి.. మధ్యాహ్నంలోగా రిపోర్ట్ అందజేయాలన్నారు.

News November 22, 2025

ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

image

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.

News November 22, 2025

iBOMMA కేసు.. సీఐడీ ఎంట్రీ

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతనిపై తెలంగాణ సైబర్ క్రైమ్‌ పోలీసులు 10కి పైగా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనీలాండరింగ్ అంశంపై ఈడీ ఆరా తీయగా, తాజాగా CID కూడా ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై వివరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం అతడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజులుగా విచారిస్తున్నారు.