News July 18, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం ‘మల్టీ ఆడియో ట్రాక్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఉపయోగించి యూజర్లు ఒకే రీల్‌కు 20 వరకు ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత యాప్‌లోని వీడియో ఎడిటర్‌లో ‘Add to mix’ అనే ఆప్షన్ ఎంచుకుని కావాల్సిన ఆడియో ట్రాక్స్‌ను సెలక్ట్ చేయాలి. ఇలా క్రియేట్ చేసిన ట్రాక్‌లను ఇతరులు కూడా వాడుకోవచ్చు.

Similar News

News December 20, 2025

అమరావతి తప్ప CBNకు ఇంకేమీ పట్టదు: అమర్నాథ్

image

AP: అమరావతి ప్రొజెక్ట్ అయితే చాలు ఇతర ప్రాంతాలేమైపోయినా ఫర్వాలేదన్నట్లు CM ఉన్నారని YCP నేత G.అమర్నాథ్ విమర్శించారు. ‘విశాఖ భూములను తన వారికి కట్టబెట్టి అక్కడ ఏ యాక్టివిటీ లేకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. సెటిల్మెంట్లపై పవన్ IAS, IPSలను కాకుండా భూముల్ని దోచిపెడుతున్న CBNను ప్రశ్నించాలి. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు తప్పదు’ అని హెచ్చరించారు. అందర్నీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు.

News December 20, 2025

TCILలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(TCIL) 5పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు జనవరి 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BE, B.Tech, MCA, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రిలిమినరీ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.tcil.net.in

News December 20, 2025

ప్రతి ఇంట్లోనూ జరగాలి ‘ముస్తాబు’

image

ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఇందుకు మంచి ఆహారమే కాకుండా శుభ్రత కూడా అవసరమే. అందరిలో అందంగా కనపడాలని ఎలా ముస్తాబవుతామో రోగాల నుంచి తప్పించుకోవడానికి ఇళ్లు, స్కూళ్లు, పరిసరాల్లో క్లీనింగ్ అవసరం. APలోని ఓ కలెక్టర్ ప్రారంభించిన <<18618970>>‘ముస్తాబు’<<>> కార్యక్రమం ఇప్పుడు అన్ని పాఠశాలల్లో ప్రారంభమైంది. ఇదే స్ఫూర్తిని ప్రతీ ఇల్లు, వీధి, గ్రామం, పట్టణం తేడాలేకుండా కొనసాగిస్తే ఆరోగ్యం, ఆనందం మన సొంతం. ఏమంటారు?