News November 7, 2024
డెంగ్యూ వ్యాప్తిని నివారించేందుకు కొత్త పద్ధతి
డెంగ్యూ, జికా, వైరల్ ఫీవర్ వ్యాప్తిని నివారించేందుకు పరిశోధకులు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఈడిస్ ఈజిప్టి అనే దోమల ద్వారా ఈ వ్యాధులు వ్యాపిస్తాయి. వీటిల్లో మగ దోమల వినికిడి శక్తిని దెబ్బతీస్తే అవి ఆడవాటితో జతకట్టలేవని ప్రొఫెసర్ క్రైగ్ మాంటెల్ ల్యాబ్లోని పరిశోధకులు తెలిపారు. ఆడ దోమలు రెక్కలతో చేసే చప్పుడు సంభోగానికి సంకేతమని, వినికిడి శక్తిని కోల్పోతే మగవి సంభోగానికి ఆసక్తి చూపవని చెప్పారు.
Similar News
News January 14, 2025
నేడు మకరజ్యోతి దర్శనం
నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనమివ్వనుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండడంతో కేరళ ప్రభుత్వం అదనపు భద్రతా సిబ్బందిని మోహరించింది. జ్యోతిని దర్శించుకునే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. జ్యోతి దర్శనం సాయంత్రం 6-7 గంటల మధ్య జరగనుంది. దీని కోసం లక్ష మందికిపైగా అయ్యప్ప భక్తులు వస్తారని అంచనా.
News January 14, 2025
స్టేషన్లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అర్ధరాత్రి కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించిన సంగతి తెలిసిందే. స్టేషన్లోనే ఆయనకు బస ఏర్పాటు చేయగా ఉదయాన్నే వైద్య పరీక్షలు నిర్వహించారు. 9 గంటలకు కరీంనగర్ రెండవ అదనపు జుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరచనున్నారు. మరోవైపు కౌశిక్ అరెస్టును బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
News January 14, 2025
సంక్రాంతి: పుణ్యకాలం సమయం ఇదే.. ఏం చేయాలంటే?
సంక్రాంతి రోజున స్నానం, దానం, పూజకు విశిష్ఠ స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని అభ్యంగ స్నానం చేయాలి. ఇవాళ పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. శని దోషం ఉన్నవారు ఈ రోజున నువ్వులు దానం చేస్తే శనీశ్వరుడు శాంతిస్తాడని నమ్మకం. ఉ.9.03 గం. నుంచి ఉ.10.48 గం. వరకు పుణ్యకాలం ఉందని, ఈ సమయంలో పూజలు, దానం చేస్తే సూర్యభగవానుడు విశేష ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం.