News April 8, 2024
OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 12 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మార్చి 22న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకోగా.. కేవలం 20 రోజుల్లోనే OTTలోకి వచ్చేస్తోంది. శ్రీ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ మ్యూజిక్ అందించారు.
Similar News
News April 9, 2026
మండిన ఎండలు.. 16 మండలాల్లో హై టెంపరేచర్

APలోని 16 మండలాల్లో ఇవాళ 40°C పైగా టెంపరేచర్ నమోదైంది. నంద్యాల(D) దొర్నిపాడు(M)లో అత్యధికంగా 42.9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. ఇక రేపు విజయనగరం(D)బాడంగి, బొబ్బిలి, తెర్లాం, వంగర.. మన్యం(D) బలిజిపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం.. పోలవరం(D) చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం.. ఏలూరు(D) కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తీవ్రవడగాలులు వీస్తాయని చెప్పింది.
News April 9, 2026
ఇంటర్ ఫలితాలపై బోర్డు క్లారిటీ

TG: ఇంటర్ ఫలితాలు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించింది. షెడ్యూల్ ప్రకారమే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామని చెప్పినట్లు ప్రభుత్వ ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం ట్వీట్ చేసింది. గతంలో ఎప్పుడూ APR మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదని గుర్తుచేసింది. మూల్యాంకన సమయాన్ని బట్టి ఫలితాల విడుదల తేదీ మారుతుందని, బోర్డు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించింది.
News April 9, 2026
IPL: టాస్ గెలిచిన LSG

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరుగుతున్న మ్యాచులో LSG టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అస్వస్థత కారణంగా పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన సునీల్ నరైన్ కోల్‌కతా జట్టులో చేరారు.
KKR: రహానే, అలెన్, గ్రీన్, రఘువంశీ, రింకూ, రమణ్‌దీప్, అనుకుల్ రాయ్, పావెల్, నరైన్, సైనీ, త్యాగి
LSG: మార్ష్, మార్క్రమ్, పంత్, పూరన్, సమద్, ముకుల్ చౌదరి, సిద్ధార్థ్, అవేశ్ ఖాన్, షమీ, దిగ్వేశ్, ప్రిన్స్ యాదవ్


