News February 4, 2025
OTTలో ఆకట్టుకుంటోన్న కొత్త సినిమా

మలయాళంలో తెరకెక్కిన ‘ఐడెంటిటీ’ సినిమా తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిన్న పాయింట్‌ను బేస్ చేసుకుని తీసిన ఈ మూవీలో థ్రిల్లర్‌కు ఉండాల్సిన అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటున్నారు. ఒకే సినిమాలో మూడు స్టోరీలను చూపించారని ప్రశంసిస్తున్నారు. ZEE5లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో టొవినో థామస్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. మరి మీరు ఈ చిత్రం చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News October 14, 2025
ఇది శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన కాలం!

ప్రతి ఏడాది ఆశ్వయుజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ‘దామోదర మాసం’గా పరిగణిస్తారు. ఇది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలమని భాగవతంలో ఉంది. ద్వాపర యుగంలో ఈ సమయంలోనే యశోదమ్మ చిన్ని కృష్ణుణ్ని రోలుకు కట్టేసిన లీల జరిగింది. ఈ క్రమంలో దామమును(తాడును), ఉదరానికి కట్టడం వల్ల ఆయన దామోదరుడు అయ్యాడు. ఈ పవిత్ర మాసంలో ఆయనను ‘దామోదర’ అనే నామంతో ఆరాధిస్తే అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
News October 14, 2025
SBIలో 63 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

SBIలో 63 మేనేజర్(క్రెడిట్ అనలిస్ట్) పోస్టులకు అప్లై చేయడానికి రేపటి వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ లేదా MBA/ PGDBA/ PGDBM/ CA/ ICWA/CFA, B.E/B.Tech/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు ₹750, SC, ST, PwBD ఫీజు లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in/
News October 14, 2025
1,743 పోస్టులు.. ఎగ్జామ్ డేట్ ఇదే

TG: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(APP) పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఎగ్జామ్ 2 షిఫ్టుల్లో జరుగుతుంది. ఉ.10 నుంచి మ. ఒంటిగంట వరకు మల్టిపుల్ ఛాయిస్, మ.2.30 నుంచి సా.5.30 గంటల వరకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 1,743 పోస్టులకు 3,132 అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే.
* ప్రతిరోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.