News September 16, 2024
‘అటర్ విచార్ మంచ్’ పేరుతో కొత్త పార్టీ

కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అటల్ విచార్ మంచ్(AVM) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. త్వరలో జరగనున్న ఝార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఐఏఎస్ అయిన యశ్వంత్ 1977లో బిహార్ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1984లో రాజీనామా చేసి లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. వాజ్‌పేయీ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
Similar News
News November 20, 2025
IIT రామయ్య@100: CM చెప్పినా సీటిచ్చేవారు కాదు!

TG: విద్యారంగంలో చుక్కా రామయ్య ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. 1925 నవంబర్ 20న జనగామ జిల్లా గూడూరులో జన్మించారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ ప్రారంభించి, కళాశాల ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేశారు. తర్వాత Hydలో IIT కోచింగ్ సెంటర్ స్థాపించారు. CM స్థాయి వ్యక్తులు రిఫర్ చేసినా సీటు ఇచ్చేవారు కాదని స్వయంగా CBN ఒకసారి చెప్పారు. రామయ్య ఉమ్మడి ఏపీలో MLCగానూ సేవలందించారు. ఇవాళ 100వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
News November 20, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 20, 2025
బొప్పాయి కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బొప్పాయిని దూరంగా ఉండే మార్కెట్లకు పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గరి మార్కెట్లలో విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోశాక పాలు ఆరేవరకు నీడలో ఉంచాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతింటుంది. కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేయాలి. బొప్పాయి రవాణా చేసే వాహనాల అడుగున, పక్కల వరిగడ్డి పరిస్తే నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.


