News March 18, 2024
MI జట్టులోకి కొత్త ప్లేయర్

IPL: ముంబై ఇండియన్స్ చివరి నిమిషంలో ఆటగాడిని రీప్లేస్ చేసుకుంది. గాయపడ్డ పేసర్ బెరండార్ఫ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ ల్యూక్ వుడ్‌ను తీసుకుంది. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇంగ్లండ్ తరఫున 2 వన్డేలు, 5 టీ20లు ఆడారు. ఇతడికి రూ.50 లక్షలు చెల్లించి MI దక్కించుకుంది.
Similar News
News February 17, 2026
పాలపళ్లను శుభ్రం చేస్తున్నారా?

పాలపళ్లు ఊడిపోయేవే కదా అని చాలామంది పేరెంట్స్ వాటిపై శ్రద్ధ చూపరు. కానీ ఇవి నోటి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఇవి దవడ ఎముక వృద్ధి చెందటానికి మార్గం చూపించడంతో పాటు శాశ్వత దంతాలకు అవసరమైన చోటును కల్పిస్తాయి. తొలి దంతం రావటానికి ముందు నుంచే శిశువుల నోటిని శుభ్రం చేయాలని చెబుతున్నారు. రోజుకు రెండుసార్లు బట్టతో/మెత్తటి బ్రష్‌తో శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.
News February 17, 2026
ఒత్తిడే అసలు శత్రువు!

మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘మనం ఒత్తిడికి గురైనప్పుడు మెదడులోని నాడీ వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది. దీనివల్ల BP, హార్ట్ బీట్ పెరగడమే కాకుండా రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి చివరికి గుండెపోటుకు దారితీస్తుంది. గుండె ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి’అని సూచిస్తున్నారు.
News February 17, 2026
మహిళలకు గుడ్‌న్యూస్.. రెండు కొత్త పథకాలు

AP: మహిళా దినోత్సవం(మార్చి 8) రోజున డ్వాక్రా మహిళా సంఘాల సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాలను ప్రారంభించనుంది. ‘కళ్యాణ లక్ష్మి’ కింద పిల్లల వివాహాలకు ₹10వేల నుంచి ₹లక్ష వరకు రుణం ఇస్తుంది. 48 వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ‘విద్యాలక్ష్మి’లో పిల్లల చదువుల కోసం ₹10,000-₹లక్ష రుణసాయం అందిస్తుంది. కనీసం 6 నెలలపాటు సభ్యత్వం ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.


