News August 3, 2024

ITR దాఖలులో సరికొత్త రికార్డు

image

2023-24కు సంబంధించి జులై 31 నాటికి 7.28 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు IT శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఇదే అత్యధికమని పేర్కొంది. గతేడాది 6.77 కోట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 50 లక్షల రిటర్నులు అధికంగా దాఖలైనట్లు తెలిపింది. కొత్త పన్ను విధానంలో 5.27 కోట్ల ITR, పాత విధానంలో 2.01 కోట్ల రిటర్నులు ఫైల్ అయ్యాయంది. మొత్తం రిటర్నుల్లో 58.57 లక్షల మంది తొలిసారి ITR ఫైల్‌ చేశారని వెల్లడించింది.

Similar News

News March 13, 2026

విశాఖ పోలీసులను అభినందించిన సీఎం

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైబర్ నేరాలపై విశాఖ పోలీసులు రూపొందించిన 24 షార్ట్ ఫిలింలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్రంలో సైబర్ మోసాలతో రూ.వేల కోట్ల నష్టం జరుగుతున్న నేపథ్యంలో అవగాహన పెంచేందుకు వీటిని రూపొందించినట్లు విశాఖ సీపీ బాగ్చీ వివరించారు. ఈ కృషికి పోలీసులను సీఎం అభినందించారు.

News March 13, 2026

40ల్లో ఈ తప్పులు చేయకండి!

image

రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే 40-50ఏళ్ల మధ్య తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆ ఏజ్‌లో జాబ్ మారేటప్పుడు PF విత్‌డ్రా చేయొద్దని, తొందరపడి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీలు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం లేని అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని, మల్టిపుల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ఏటా మీ పోర్ట్‌ఫోలియో చెక్ చేసుకొని సవరించుకోవాలని చెబుతున్నారు.

News March 13, 2026

ఈరోజు నమాజ్ వేళలు (13-3-2026) శుక్రవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.14 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.22 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.49 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.