News March 16, 2024

టీ20ల్లో కొత్త రికార్డు

image

అంతర్జాతీయ టీ20ల్లో 400 ఫోర్లు బాదిన తొలి బ్యాటర్‌గా ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ రికార్డు సృష్టించారు. అత్యధిక ఫోర్లు కొట్టిన ప్లేయర్ల లిస్టులో అతను 401 ఫోర్లతో టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బాబర్ ఆజమ్ (395), విరాట్ కోహ్లీ (361), రోహిత్ శర్మ (359, డేవిడ్ వార్నర్ (320) ఉన్నారు. ఇక సిక్సర్ల విషయానికి వస్తే రోహిత్ శర్మ (190) తొలి స్థానంలో కొనసాగుతున్నారు.

Similar News

News August 29, 2025

ఆ వీడియోలో ఉన్నవాళ్లంతా టీడీపీనే: వైసీపీ

image

AP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే <<17554192>>కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి<<>> హత్య ప్లాన్‌లో ఉన్నదంతా టీడీపీ కార్యకర్తలేనని వైసీపీ ట్వీట్ చేసింది. వారంతా కోటంరెడ్డి బ్రదర్స్, రూప్ కుమార్ అనుచరులేనని కౌంటరిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే కోటంరెడ్డి మర్డర్ ప్లాన్ అంటూ వీడియో క్రియేట్ చేశారని ఆరోపించింది. జగదీశ్, వినీత్, మహేశ్ టీడీపీ కార్యకర్తలేనని నాయకులతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.

News August 29, 2025

‘AA22’లో కమెడియన్ యోగిబాబు!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తోన్న ‘AA22’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ముంబైలో షూట్ జరుగుతోందని, ఇందులో మృణాల్ & యోగిబాబు కూడా నటిస్తున్నారని సినీవర్గాలు తెలిపాయి. యోగిబాబు రోల్ ఉండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుందని అంటున్నారు. అట్లీ-షారుఖ్ కాంబోలో వచ్చిన ‘జవాన్’లోనూ ఈయన కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

News August 29, 2025

ప్రో కబడ్డీ లీగ్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 అట్టహాసంగా ప్రారంభమైంది. వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో లీగ్ మొదలైంది. ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కోర్టులో కబడ్డీ, క్రికెట్ ఆడి ప్రేక్షకులను అలరించారు. కాగా తొలి మ్యాచులో భాగంగా తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ తలపడుతున్నాయి.