News September 7, 2024

147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు

image

క్రికెట్ చరిత్రలో తొలి 7 టెస్ట్ సెంచరీలను 7 వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్‌గా ఇంగ్లండ్ ప్లేయర్ ఒలి పోప్ నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఫీట్‌ను సాధించారు. పోప్ కు ఇది 49వ టెస్ట్ కాగా, ఇప్పటివరకు 7 సెంచరీలు బాదారు. వీటిని ఆరు వేర్వేరు మైదానాల్లో చేయడం విశేషం. SA, NZ, IND, SL, WI, IRE, PAK జట్లపై ఆయన శతకాలు నమోదు చేశారు.

Similar News

News December 8, 2025

ఖమ్మం: తొలి విడతలోనే అతి పెద్ద పంచాయతీ పోరు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 40,761 మంది ఓటర్లు ఉన్న భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీకి డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. అతిపెద్ద పోలింగ్ కేంద్రంగా నిలిచిన ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. న్యాయపరమైన చిక్కుల తర్వాత ప్రస్తుతం ఒకే పంచాయతీగా పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్‌కు 5, 20 వార్డులకు 75 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోరు ఉత్కంఠగా మారింది.

News December 8, 2025

హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!

image

వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా UIDAI కొత్త రూల్ తీసుకురానుంది. QR కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు చేయనుంది. ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది. యూజర్ల ప్రైవసీకి, డేటాకు రక్షణ కల్పించేందుకు UIDAI ఈ దిశగా అడుగులేస్తోంది. దీంతో ఓయో, ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలగనుంది.

News December 8, 2025

డెయిరీఫామ్‌తో నెలకు రూ.1.25 లక్షల ఆదాయం

image

స్త్రీలు కూడా డెయిరీఫామ్ రంగంలో రాణిస్తారని నిరూపిస్తున్నారు హిమాచల్‌ప్రదేశ్‌లోని తుంగల్ లోయకు చెందిన సకీనా ఠాకూర్. పీజీ పూర్తి చేసిన ఈ యువతి కుటుంబం వద్దన్నా ఈ రంగంలో అడుగుపెట్టారు. తన ఫామ్‌లో ఉన్న 14 హెచ్‌ఎఫ్ ఆవుల నుంచి రోజూ 112 లీటర్ల పాలను విక్రయిస్తూ.. నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. సకీనా సక్సెస్ వెనుక కారణాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.