News November 2, 2024
UPI లావాదేవీల్లో సరికొత్త రికార్డు
వరుస పండుగల సందర్భంగా యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అక్టోబర్లో ట్రాన్సాక్షన్ల సంఖ్య 16.58 బిలియన్లు, విలువ రూ.23.5 లక్షల కోట్లుగా నమోదైనట్లు NPCI వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక నెలలో ఇదే అత్యధికమని తెలిపింది. వార్షిక ప్రాతిపదికన లావాదేవీల సంఖ్యలో 45 శాతం, విలువపరంగా 34 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది. రోజువారీ లావాదేవీలు 535 మిలియన్లుగా నమోదైనట్లు వివరించింది.
Similar News
News November 2, 2024
ఎలక్షన్ షెడ్యూల్.. సీఎం విజయనగరం పర్యటన రద్దు
AP: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ <<14509068>>షెడ్యూల్<<>> వెలువడిన నేపథ్యంలో ఇవాళ్టి సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన రద్దయ్యింది. దానికి బదులుగా అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారు. తొలుత చింతలగోరువానిపాలెంలోని లారెస్ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత రుషికొండ భవనాలను పరిశీలిస్తారు.
News November 2, 2024
ట్రంప్ గెలవగానే యుద్ధానికి చెక్?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వెంటనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెడతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ అమెరికా మిలిటరీ, నిధులపై విపరీతంగా ఆధారపడుతోంది. 2022 నుంచి బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్కు 56 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం చేశారు. అయితే యుద్ధం ఆపితే భారీగా నిధులు ఆదా చేసుకుని అమెరికా అభివృద్ధికి ఖర్చు పెట్టాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.
News November 2, 2024
ఎల్లుండి టెట్ ఫలితాలు.. 6న డీఎస్సీ నోటిఫికేషన్
AP: అక్టోబర్ 3 నుంచి 21 వరకు జరిగిన టెట్ ఫలితాలను ఎల్లుండి మంత్రి లోకేశ్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. టెట్ రిజల్ట్స్ రాగానే ఈ నెల 6వ తేదీన 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించనుంది.