News November 13, 2024

WHATSAPP యూజర్లే టార్గెట్‌గా సైబర్ క్రిమినల్స్ కొత్త స్కామ్

image

పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వేలాదిగా జంటలు పెళ్లిపీటలు ఎక్కనున్నాయి. ఇదే అదనుగా సైబర్ క్రిమినల్స్ పాత APK స్కామ్‌నే మళ్లీ కొత్తగా మొదలుపెట్టారు. తెలియని ఫోన్ నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు పెళ్లి ఇన్విటేషన్ పంపిస్తారు. అందులో APK ఫైల్ ఉంచుతారు. దాన్ని తెరవగానే మీ మొబైల్లో సీక్రెట్‌గా ఇన్‌స్టాలై బ్యాంకు, పర్సనల్ డేటాను దొంగిలిస్తుంది. దీని ఆధారంగా క్రిమినల్స్ మీ బ్యాంకులోని డబ్బును దోచుకుంటారు.

Similar News

News October 22, 2025

రేపటి మ్యాచ్‌కు వర్షం ముప్పుందా?

image

రేపు భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే జరిగే అడిలైడ్‌లో వర్షం ముప్పు 20% ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. అయితే మ్యాచ్‌కు అంతరాయం కలిగించకపోవచ్చని పేర్కొంది. దీంతో 50 ఓవర్ల ఆట జరగనుంది. ఇక తొలి వన్డేకు వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఇందులో AUS 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌‌లో నిలవాలంటే రేపటి మ్యాచులో తప్పక గెలవాలి.

News October 22, 2025

నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.250 కోట్లు విడుదల

image

AP: ఎన్టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రుల బ‌కాయిల్లో రూ.250 కోట్లను ప్ర‌భుత్వం విడుదల చేసింది. మరో రూ.250కోట్లు త్వరలోనే రిలీజ్ చేస్తామంది. ఈ క్రమంలో నెట్‌వర్క్ ఆస్పత్రులు వెంటనే సమ్మె విరమించాలని విన్నవించింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ భేటీ అయి నిధుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రూ.250CR విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని పయ్యావుల వివరించారు.

News October 22, 2025

సర్ఫరాజ్ ఇంకా ఏం నిరూపించుకోవాలి: అశ్విన్

image

సర్ఫరాజ్ ఖాన్‌ను ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై మాజీ ప్లేయర్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అతడు ఇంకా ఏం నిరూపించుకోవాలి? బరువు తగ్గాడు. భారీగా పరుగులు చేశాడు. గతేడాది న్యూజిలాండ్‌తో టెస్టులో సెంచరీ కూడా బాదాడు. కానీ అప్పటి నుంచి సీనియర్ టీమ్‌లో కాదు కదా A జట్టులో కూడా చోటు దక్కకపోతే ఎలా? ఇక అతడి అవసరం లేదేమో.. సర్ఫరాజ్‌కు డోర్లు దాదాపు మూసుకుపోయినట్లే’ అని వ్యాఖ్యానించారు.