News November 13, 2024
OTTలోకి వచ్చేసిన కొత్త తెలుగు సినిమా

సుధీర్ బాబు హీరోగా నటించిన ఎమోషనల్ డ్రామా ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 15 నుంచి జీ5లోకి వస్తుందని అనౌన్స్ చేసినా.. ఇవాళ్టి నుంచే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సాయాజీ షిండే, సుధీర్ బాబు తండ్రీకొడుకులుగా నటించారు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్ అంతగా రాబట్టలేకపోయింది.
Similar News
News December 3, 2025
పలు జిల్లాలకు వర్షసూచన

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News December 3, 2025
నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
News December 3, 2025
ఊట వేసిన మడి, వాత వేసిన పశువు

‘ఊట వేసిన మడి’ అంటే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న పొలం (మడి). ఇది ఎప్పుడూ పచ్చగా, సమృద్ధిగా ఉంటుందని, దిగుబడి బాగా వస్తుందని అర్థం. అలాగే పూర్వకాలంలో పశువులకు (ముఖ్యంగా ఆవులు, ఎద్దులు) వ్యాధులు వచ్చినప్పుడు లేదా గాయాలు తగిలినప్పుడు ‘వాత’ వేసి చికిత్స అందించి నయం చేసేవారు. ఇలా ఊట వేసిన మడి, వాత వేసిన పశువు వల్ల రైతుకు మేలే జరుగుతుందని ఈ సామెత చెబుతుంది.


