News November 24, 2024
వర్కౌట్ కాని BJP ‘బంటీ ఔర్ బబ్లీ’ అస్త్రం!

ఝార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచారంలో BJP ‘బంటీ ఔర్ బబ్లీ’ అని సెటైర్లు వేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోరెన్ జైలుకెళ్లడంతో ఇద్దరూ ‘తోడు దొంగలు’ అనే అర్థం వచ్చేలా BJP పదేపదే ఈ కామెంట్స్ చేస్తూ వచ్చింది. ‘బంటీ ఔర్ బబ్లీ’ అనేది బాలీవుడ్ సినిమా టైటిల్. అయితే BJP ప్రయోగించిన ఈ అస్త్రం ఫలించలేదు. సోరెన్ పార్టీ JMM ఘన విజయం సాధించింది.
Similar News
News November 28, 2025
బాపట్ల: ‘జిల్లాలో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి’

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం సేకరణ ప్రక్రియను అధికారులు మరింత వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే కలెక్టరేట్‌కు సమాచారం పంపించాలని అన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ భావన అధికారులు పాల్గొన్నారు.
News November 28, 2025
NZB: 30న జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా స్థాయి సీనియర్ మహిళా, పురుషుల జిల్లా జట్ల ఎంపికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు ముప్కాల్‌లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో పాల్గొనే పురుషుల వ్యక్తిగత శరీర బరువు 85 kgలు, మహిళల వ్యక్తిగత శరీర బరువు 75 kgల లోపు ఉండాలన్నారు.
News November 28, 2025
టుడే టాప్ స్టోరీస్

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్


