News April 4, 2025
బియ్యపు గింజ కంటే చిన్నదైన పేస్‌మేకర్

ప్రపంచంలోనే అతి చిన్నదైన పేస్‌మేకర్‌ను నార్త్‌వెస్ట్రన్ వర్సిటీ(US) సైంటిస్టులు రూపొందించారు. ఇది 1.8mm వెడల్పు, 3.5mm పొడవుతో ఒక బియ్యపు గింజ కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఇది అన్ని సైజుల గుండెలకు పనిచేస్తుంది. అయితే గుండె జబ్బులతో జన్మించిన పిల్లలకు బాగా సూటవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హార్ట్ ఆపరేషన్ల సమయంలో టెంపరరీ పేస్‌మేకర్ కీలక పాత్ర పోషిస్తుందని, సైజ్ కూడా కీలకమేనని పేర్కొంటున్నారు.
Similar News
News November 28, 2025
హెయిర్లాస్కు చెక్ పెట్టే LED హెల్మెట్

వాతావరణ మార్పులు, జీవనశైలి వల్ల హెయిర్‌లాస్ కామన్ అయిపోయింది. దీనికి ఈ LED రెడ్‌లైట్ హెల్మెట్ పరిష్కారం చూపుతుంది. ఈ డివైజ్‌ని ఆన్ చేసి రోజూ 25 నిమిషాలు తలకు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ట్రీట్మెంట్ సెషన్లను ట్రాక్ చేయడానికి రిమోట్లో ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. దీంట్లోని సెన్సార్లు ఉష్ణోగ్రత స్థాయిని పెరగనివ్వకుండా చూస్తాయి. ఇవి అన్ని ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
News November 28, 2025
స్వామి సన్నిధానాన్ని చేరేందుకు.. కష్టాన్ని కూడా మర్చిపోతారు

శబరిమల యాత్రలో నీలిమల కొండను కఠినమైన సవాలుగా భావిస్తారు. కానీ, అయ్యప్ప నామ స్మరణతో సులభంగా ఈ కొండను ఎక్కేస్తారు. అయితే ఇక్కడి నుంచే భక్తులకు సన్నిధానానికి త్వరగా చేరాలనే ఉత్కంఠ, స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడాలనే ఆత్రుత మొదలవుతాయట. స్వామి దర్శనం పట్ల ఉండే ఈ అపారమైన భక్తి భావమే ఈ కఠినమైన దారిని సులభంగా దాటేలా చేస్తుందని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>
News November 28, 2025
128 మంది మృతి.. కారణమిదే!

హాంగ్‌కాంగ్‌లోని అపార్ట్‌మెంటలో ఘోర <<18395020>>అగ్నిప్రమాదం<<>> పెను విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 128 మంది మరణించగా 79 మంది గాయపడ్డారు. వందల ఫైర్ ఇంజిన్లు, 2,300 మంది ఫైర్ ఫైటర్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఆయా అపార్ట్మెంట్లలో ఫైర్ అలారాలు పనిచేయకపోవడంతో నివాసితులు మంటలను గుర్తించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. 128మంది సజీవదహనానికి ఇదే కారణమని భావిస్తున్నారు.


