News July 14, 2024

అమర జవాన్ భార్యపై చెత్త కామెంట్స్ చేసింది పాకిస్థానీ: రేఖా శర్మ

image

అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్య స్మృతిపై అసభ్యకర కామెంట్స్ చేసింది పాకిస్థానీ అని తెలుస్తోందని NCW ఛైర్‌పర్సన్ రేఖాశర్మ వెల్లడించారు. ‘అదొక దిగజారుడు కామెంట్. సోషల్ మీడియాలో దాన్ని చూడగానే సుమోటోగా తీసుకున్నాం. పోలీసులు FIR <<13622271>>నమోదు<<>> చేశారు’ అని తెలిపారు. గత ఏడాది సియాచిన్‌లో వీరమరణం పొందిన అన్షుమాన్‌కు కేంద్రం కీర్తి చక్ర అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News March 28, 2026

మార్చి 28: చరిత్రలో ఈరోజు

image

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం

News March 28, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 28, 2026

బర్గర్ కంపెనీ బంపర్ గిఫ్ట్: ఉద్యోగులకు ₹15 కోట్ల బోనస్!

image

USకు చెందిన ప్రముఖ బర్గర్ చైన్ ‘ఫైవ్ గాయ్స్’ తన ఉద్యోగులకు సుమారు ₹15 కోట్ల బోనస్ ప్రకటించింది. సంస్థ 40వ వార్షికోత్సవం సందర్భంగా Feb 17న ఇచ్చిన ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్‌కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్ల రద్దీ వల్ల స్టాక్ అయిపోవడం, ఆన్‌లైన్ సిస్టమ్స్ నిలిచిపోవడం వంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి. అయినా కమిటెడ్‌గా వర్క్ చేసిన 1,500 మంది ఉద్యోగులకు CEO జెర్రీ ముర్రెల్ ఈ నగదు బహుమతి అందించారు.